నేటి తరం యువతి యువకులు క్షణికావేశంలో చిన్న చిన్నకారణాలకు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ప్రియుడు మోసం చేశాడని, తల్లిదండ్రులు మందలించారని ఇదిగాక పరీక్షసరిగ్గా రాయలేకపోయానని ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. సరిగ్గా ఇలాగే ఆలోచించిన ఓ బాలిక బలవన్మరణానికి పాల్పడి తల్లిదండ్రుల కంట కన్నీరును మిగిల్చి అందనంత దూరాలకు వెళ్లిపోయింది. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అది మన్యం జిల్లా సాలూరు పట్టణం తట్టికోట. ఇదే ప్రాంతానికి చెందిన ఓ భార్యాభర్తకలకు ఇద్దరు సంతానం. కుమారుడు వీరి వద్దే ఉంటూ స్థానికంగా 9వ తరగతి చదువుతుండగా.. కూతురు రోషిణి శ్రీకాకుళం జిల్లాలోని ఐఐఐటీలో పీయూసీ రెండవ సంవత్సరం చదువుతూ హాస్టల్ లోనే ఉంటుంది.
అయితే మొదటి నుంచి చదువులో మంచి ప్రతిభను కనబరిచిన రోషిణి రెండో ఏడాది మొదటి సెమిస్టర్ లో ఏకంగా 9.3 మార్కులతో సత్తా చాటింది. ఇదిలా ఉంటే ఇటీవల ముగిసిన రెండో ఏడాది చివరి సెమిస్టర్ లో రోషిణి అన్ని సబ్జెక్టులను బాగా రాసింది. కానీ చివరికి పరీక్షలో మాత్రం కాస్త ఏదో తేడా అనిపించింది. రాత్రిళ్లు బాగా కష్టపడి చదివినా కూడా ఎందుకో బాగా రాయాలేకపోయాననే బాధలో తనలో తాను కుములిపోతూ ఉంది. ఇక బుధవారం రెండో ఏడాది చివరి సెమిస్టర్ పరీక్షలు ముగియడంతో కాలేజీ యాజమాన్యం మూడు రోజులు సెలవులు ప్రకటించారు. తెల్లారితే రోషిణి పుట్టిన రోజు తల్లిదండ్రులతో కలిసి ఇంట్లో పుట్టిన రోజు వేడుకలను ఘనంగా జరుపుకోవాలని ఎప్పటి నుంచి అనుకుంటూ ఉంది. కానీ పరీక్ష బాగా రాయలేదనే ఆలోచనతో అవన్నీ మరిచిపోయింది. ఇక ఆమెకు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి.
తీవ్ర ఒత్తిడికి లోనైంది. దీంతో రోషిణి…, అమ్మా.. నాన్న.. నన్ను క్షమించండి. మీ అంచనాలు, ఆశలు అందుకోలేకపోతున్నాను. తమ్ముడిని బాగా చదివించండి అంటూ సూసైడ్ లెటర్ రాసి ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషయం తెలుసుకున్న క్యాంపస్ సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి అనంతరం రోషిణి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. ఈ విషయం తెలుసుకున్న ఆ బాలిక తల్లిదండ్రులు చనిపోయిన కూతురును చూసి కన్నీరు మున్నీరుగా విలపించారు. బర్త్ డే రోజుకు ఒక రోజు ముందే రోషిణి ఆత్మహత్య చేసుకోవడంతో వారి బంధువులు కన్నీ టి సంద్రంలో మునిగిపోయారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.