స్త్రీని గౌరవించడం మన అందరి కనీస బాధ్యత. కానీ.., ఆ ఆటో డ్రైవర్ మాత్రం విచక్షణ కోల్పోయి తనకి సాయం చేసిన మహిళనే కాలితో తన్నాడు. ఇప్పుడు చేసిన పాపానికి శిక్ష అనుభవిస్తూ., కటకటాలు లెక్క పెడుతున్నాడు. ఆ వివరాల్లోకి వెళ్తే.., విజయవాడకి చెందిన గోవర్ధని అనే మహిళని ఆటో డ్రైవర్ పోకల గోపి కృష్ణ కాలితో తన్నిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే.
గోపి కృష్ణ.. గోవర్ధని వద్ద 3 లక్షల నగదు వడ్డీకి తీసుకున్నాడు. కానీ.., అవి సకాలంలో చెల్లించలేదు. తన డబ్బు తనకి తిరిగి ఇవ్వమని అడిగినందుకు గోపి కృష్ణ ఆమె పట్ల ఇంత నీచంగా ప్రవర్తించాడు. గోపి కృష్ణ కాలితో ఎగిరి తన్నటంతో ఆ మహిళ అక్కడే కుప్పకూలి పోయింది. దీని తరువాత సదురు మహిళ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో..మంగళగిరి రూరల్ ఎస్సై లోకేష్ నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కనీసం మహిళ అని కూడా మానవత్వం చూపించకుండా ప్రవర్తించిన గోపి కృష్ణకి కఠిన శిక్ష విధించాలని నెటిజన్స్ డిమాండ్ చేస్తున్నారు. మరి.. మహిళలకి కనీస మర్యాద, గౌరవం ఇవ్వని ఇలాంటి వ్యక్తికి ఏ శిక్ష విధించాలి? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.