భర్త మీద కోపంతో ఆ మహిళ తీసుకున్న నిర్ణయం.. ఆరుగురి ప్రాణాలు బలి తీసుకుంది. బాధితులంతా గాఢ నిద్రలో ఉండగా.. ఇంటి మీద పెట్రోల్ పోసి.. నిప్పటించింది. మంటలు అంటుకోగానే.. వారంతా.. సాయం కోసం కిటికీలు.. తలుపుల దగ్గరకు వచ్చారు. కానీ అప్పటికే ఆలస్యం కావడం.. త్వరగా స్పందించకపోవడంతో.. అక్కడే అలాగే దహనం అయ్యారు. ఈ ప్రమాదంలో ఓ తల్లి.. తన బిడ్డను కాపాడుకునేందుకు ఒడిలో పెట్టుకుని కూర్చుంది. కానీ కాపాడేవారు రాకపోవడంతో.. అలానే బిడ్డతో సహా సజీవదహనం అయ్యింది. ఆ ఇంటిని చూస్తే.. ప్రాణరక్షణ కోసం భయంతో వారు చేసిన ఆర్తనాదాలు.. మన చేవుల్లో మారుమోగుతాయి. ఈ ప్రమాదంలో అన్నింటికన్నా కలచివేసే దృశ్యం ఏంటంటే.. ముక్కపచ్చలారని పసి పిల్లలు అగ్ని కీలల్లో దహనమయ్యారు. చుట్టుచూపుగా వచ్చి.. సజీవదహనమయ్యారు. మరి ఇంత కర్కశంగా ప్రవర్తించిన వారు ఎవరు.. ఎందుకు ఇంతటి దారుణానికి పాల్పడ్డారు అనే వివరాలు..
మంచిర్యాల జిల్లా గుడిపెల్లి (వెంకటాపూర్) గ్రామంలో ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. వివాహేతర సంబంధం, వారసత్వ ఉద్యోగం, డబ్బుల వివాదం కారణంగా ఈ దారుణం చోటు చేసుకుందని ప్రాథామిక దర్యాప్తులో తేలింది. ఈ ప్రమాదంలో మాస పద్మ, శివయ్య, శనిగారాపు శాంతయ్య, మౌనిక ఆమె కుమార్తెలు ప్రశాంతి, హిమబిందు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మాస శివయ్య, పద్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఓ కొడుకు సంతానం ఉన్నారు. శివయ్య వీఆర్‌ఏగా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో శివయ్య కుమార్తె.. నాలుగు నెలల క్రితం ఆత్మహత్య చేసుకుంది. కుమారుడు నస్పూర్‌లో, రెండో కుమార్తె.. హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు.
ఈ క్రమంలో పెద్ద కుమార్తె చనిపోవడంతో.. మూడు నెలల క్రితం శివయ్య, పద్మ దంపతులు.. స్వగ్రామానికి వచ్చారు. అప్పటి నుంచి ఊరిలోని పెంకుటింట్లో నివాసం ఉంటున్నారు. ఇలా ఉండగా.. శివయ్య భార్య పద్మకు.. సింగరేణి కార్మికుడు శాంతయ్యతో వివాహేతర సంబంధం ఉంది. శాంతయ్య స్వస్థలం.. మంచిర్యాల జిల్లా.. లక్షెట్టిపేట మండలం ఉట్కూర్. అతడు శ్రీరాంపూర్ భూగర్భగనిలో ఉద్యోగం చేస్తుండేవాడు. అతడికి భార్య సృజన, ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. కుమారులు చదువు పూర్తి.. చేసుకుని.. ప్రస్తుతం ఖాళీగా ఉంటున్నారు. వీరంతా గోదావరి ఖనిలో నివాసం ఉంటున్నారు.
పదేళ్ల క్రితం పద్మ.. శ్రీరాంపూర్‌లో సింగరేణి ఉద్యోగుల ఇళ్లల్లో పని చేసేది. అక్కడే విధులు నిర్వహిస్తున్న శాంతయ్యతో ఆమెకు పరిచయం ఏర్పడింది. అది కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది. అప్పటి నుంచి వారి మధ్య సంబంధం కొనసాగుతోంది. ఈ విషయమై శాంతయ్య, ఆయన భార్య సృజనకు ఇప్పటికే అనేకసార్లు గొడవలు జరిగాయి. పంచాయతీ పెట్టారు. పోలీసులు కూడా కౌన్సిలింగ్ ఇచ్చారు. ఇది ఇలా ఉండగా.. శాంతయ్య కుమారులు వారసత్వ ఉద్యోగం కోసం తండ్రి మీద ఒత్తిడి తీసుకురాసాగారు. సింగరేణి ఉద్యోగులు.. పదవీవిరమణకు రెండు సంవత్సరాల ముందు.. అన్‌ఫిట్‌గా ధృవీకరణ పొందితే.. వారసులకు ఉద్యోగం వస్తుంది. దాంతో శాంతయ్యను అన్‌ఫిట్‌గా ధృవీకరణ పొందాల్సిందిగా భార్య, కుమారులు ఒత్తిడి చేయసాగారు.
దీనికి తోడు కొన్ని రోజుల క్రిత శాంతయ్య.. ఉట్కూర్‌లో ఉన్న స్థలాన్ని విక్రయించగా.. 25 లక్షల రూపాయలు వచ్చినట్లు తెలిసింది. ఆమొత్తంతో పాటు.. జీతం డబ్బులను కూడా పద్మకే ఇస్తున్నాడని.. కుటుంబ సభ్యులు అతడిపై కోపం పెంచుకున్నారు. ఇక ప్రసుత్తం పద్మ వాళ్లు కుమార్తె అంత్యక్రియల నిమిత్తం వచ్చి గుడిపెల్లి గ్రామంలోనే ఉంటున్నారు. అప్పటి నుంచి శాంతయ్య కూడా వారితోనే.. ఆ ఇంట్లోనే ఉంటున్నాడు. జీతం, స్థలం అమ్మిన డబ్బులు పద్మకే ఇవ్వడం కాక.. డ్యూటీకి కూడా సరిగా వెళ్లకపోవడంతో.. సృజన.. భర్త శాంతయ్యపై కోపం పెంచుకుంది. ఎలాగైనా అంతం చేయాలనుకుంది.
ఇక్కడ మరో ఆసక్తికర అంశం ఏంటంటే.. సృజన కూడా గత కొంత కాలంగా.. మరో వ్యక్తితో వివాహేతర సంబంధంలో ఉంది. ఇక భర్తను చంపాలనుకున్న సృజన.. ప్రియుడితో కలిసి అతడి హత్యకు ప్లాన్ చేసింది. ఏకంగా 2 లక్షల సుపారీ కూడా ఇచ్చింది. ఇక గత ఆరు నెలలుగా శాంతయ్య మీద హత్య ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఓ సారి కిడ్నాప్ చేయాలని కూడా ప్రయత్నించారు. కానీ అతడు తప్పించుకున్నాడు. ఈసారి అలా జరగకూడదని భావించిన.. సృజన.. తన భర్త శాంతయ్యతో పాటు పద్మ, ఆమె కుటుంబాన్ని కూడా అంతం చేయాలని భావించింది. దానికి తగ్గట్టుగా ప్లాన్ చేసుకున్నారు.
ఈ ప్రమాదంలో మరణించిన మౌనిక.. పద్మకు కూతురు వరస అవుతుంది. పద్మ చెల్లెలి కుమార్తె మౌనిక. కొన్నేళ్ల క్రితం ఆమె భర్త చనిపోయాడు. మౌనికకు ఇద్దరు చిన్నారులున్నారు. ఆమె కొండపేటలో నివాసం ఉంటుంది. పద్మ కొన్ని రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో గాయపడింది. ఆమెను పలకరించడం కోసం మౌనిక.. రెండు రోజుల క్రితం.. పిల్లలను తీసుకుని పద్మ ఇంటికి వచ్చింది.
ఇక భర్తను చంపాలనుకున్న సృజన ప్రియుడితో కలిసి ప్లాన్ చేసింది. ముందుగా శాంతయ్య, పద్మ కుటుంబ సభ్యులు తినే ఆహారంలో మత్తు మందు కలిపింది. వారంతా గాఢ నిద్రలో ఉండగా.. ఇంటి మీద పెట్రోల పోసి నిప్పంటించారు. మంటలు చెలరేగుతున్నప్పటికి.. మత్తులో ఉండటంతో వెంటనే మెలకువ రాలేదు. ఆ తర్వాత సాయం కోరినా లాభం లేకపోయింది. ఒక వ్యక్తి మీద కోపం.. అభంశుభం తెలియని ఇద్దరు చిన్నారుల సహా.. ఆరుగురిని బలి తీసుకుంది. ఇద్దరి మీద కోపంతో.. ఆరుగురిని బలి తీసుకున్న సృజన నిర్ణయం సరైందేనా.. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.