ఈ రోజుల్లో పెద్దలు కుదిర్చిన పెళ్లిల కన్నా ప్రేమ వివాహల్లోనే ఎక్కువ మనస్పర్ధలు వచ్చి పెళ్లైన కొన్నాళ్లకే కాపురాలు కూలిపోతున్నాయి. ఇక మనస్పర్ధలు రావడంతో కొందరు దంపతులు విడాకులు తీసుకోవడం లేదంటే హత్యలు, ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఓ మహిళ జీవితంతో కూడా అచ్చం అదే జరిగింది. పెళ్లి చేసుకున్న ఏడాదిలోనే వేధింపులు భరించలేక ఆ మహిళ నిండు ప్రాణాలు తీసుకుంది. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది.
పోలీసుల కథనం ప్రకారం.. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం నారాయణపూర్ గ్రామం. ఇక్కడే మారుపాక రాకేష్, ప్రవళిక దంపతులు నివాసం ఉంటున్నారు. ఇదే గ్రామానికి చెందిన ఇద్దరు గతేడాది ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే పెళ్లైన కొంత కాలం పాటు ఈ దంపతులు సంతోషంగానే ఉన్నారు. ఇదిలా ఉంటే నాలుగు నెలల క్రితం ఈ దంపతులకు ఓ ఆడపిల్ల జన్మించింది. దీంతో అప్పట నుంచి భర్త, అతని తల్లిదండ్రులు ప్రవళికను సూటి పోటి మాటలతో హింసిస్తున్నారు. ప్రవళిక ఆడ పిల్లకు జన్మనిచ్చిందనే కారణంతో అత్తమామము రోజూ వేధించడం మొదలు పెట్టారు.
ఇక ఇదే కాకుండా అదనపు కట్నం తేవాలంటూ కూడా భర్త, అత్తమామలు టార్చర్ పెట్టేవారు. వీరి వేధింపులు రోజు రోజుకు ఎక్కువవంతో ప్రవళిక తట్టుకోలేకపోయింది. ఇక తీవ్ర మనస్థాపానికి చెందిన ఈ మహిళ ఈ నెల 12న పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వెంటనే గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఇక చికిత్స పొందిన ప్రవళిక శుక్రవారం మరణించింది. కూతురు మరణించడంతో ప్రవళిక తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. అనంతరం ఈ ఘటనపై స్పందించిన ప్రవళిక తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు భర్త, అత్తమామలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రవళిక తల్లిదండ్రుల మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది.