మంచిర్యాల జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. అందరూ చూస్తుండగానే కొందరు దుండగులు ఓ యువకుడిని అతి కిరాతకంగా హత్య చేశారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది.
తెలంగాణలో మరో దారుణం చోటు చేసుకుంది. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ఇందారం గ్రామానికి చెందిన మహేష్ అనే యువకుడిని పట్టపగలు రాళ్లతో కొట్టి చంపారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రేమ పేరుతో పెళ్లైన మహిళను వేధిస్తున్నాడని, దీని కారణంగానే ఆ యువకుడిని వివాహిత కుటుంబ సభ్యులు కలిసి హత్య చేశారని సమాచారం. అయితే మహేష్ మృతిపై అతని తల్లి తాజాగా స్పందించి గుండెలు పగిలేలా ఏడ్చింది. నా కొడుకుని ఆ మహిళ కుటుంబ సభ్యులు అన్యాయంగా చంపారని వాపోయింది.
నా కుమారుడు ఎలాంటి తప్పు చేయలేదని, కావాలనే హత్య చేశారని తెలిపింది. ఇలాంటి పరిస్థితి ఏ తల్లి కూడా రాకూడదని, మాకు న్యాయం చేయాలంటూ ఆ తల్లి కన్నీరు మున్నీరుగా విలపించింది. నా కొడుకుని ఎలా చంపారో వాళ్లని కూడా అలాగే చంపాలంటూ కన్నీరు మున్నీరుగా విలపించింది. అనంతరం ఈ ఘటనపై స్థానిక పోలీసులు స్పందించి మీడియాతో మాట్లాడారు. దీనిపై కేసు నమోదు చేసుసుకున్నామని, అన్ని కోణాల్లో విచారణ జరిపి పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని తెలిపారు. అయితే ఈ ఘటనలో నిందితులను పోలీసులు అరెస్ట్ చేసినట్లుగా కూడా తెలుస్తుంది. పెళ్లైన మహిళను ప్రేమ పేరుతో వేధించిన కారణంగానే ఆ యువకుడిని దారుణంగా హత్య చేశారా? లేక మరేదైనా కారణం ఉందా అనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. పట్టపగలు దారుణంగా హత్య చేసిన ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.