మంచిర్యాల జిల్లాలో మహేష్ అనే యువకుడిని వివాహిత కుటుంబికులు దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనలో తాజాగా సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి.
మంచిర్యాల జిల్లాలో మహేష్ అనే యువకుడిని వివాహిత కుటుంభికులు నడి రోడ్డుపై దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. పట్టపగలు అందరూ అందరూ చూస్తుండగానే కత్తితో పొడిచి రాళ్లతో కొట్టి చంపారు. మంగళవారం చోటు చేసుకున్న ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారుతోంది. అయితే పెళ్లైన యువతిని వేధిస్తూ అసభ్యకరమైన మెసేజ్ లు పంపడం కారణంగానే యువతి కుటుంబ సభ్యులు మహేష్ ను హత్య చేసినట్లుగా తెలుస్తుంది. ఈ ఘటనపై వెంటనే స్పందించిన పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ ఘటనలో ఒక్కొక్కటిగా సంచలన నిజాలు బయటకు వస్తున్నాయి.
అసలేం జరిగిందంటే?
పోలీసుల కథనం ప్రకారం.. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ఇందారం గ్రామంలో మహేష్ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. ఇతనికి గతంలో ఇదే గ్రామానికి చెందిన ఓ యువతితో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్త ప్రేమగా మారడంతో ఇద్దరూ కొన్నాళ్ల పాటు ప్రేమించుకున్నట్లుగా తెలుస్తుంది. ఇకపోతే ఆ యువతి కుటుంబ సభ్యులు ఆమెకు మరో యువకుడితో గతంలో వివాహం జరిపించారు. అయినా మరిచి పోని మహేష్ ఆ యువతితో పెళ్లైన కూడా మాట్లాడినట్లు సమాచారం. ఇదే విషయం ఆ యువతి భర్తకు తెలిసింది. దీంతో అతడు తీవ్ర మనస్థాపానికి గురై భార్యకు విడాకులిచ్చి ఆ తర్వాత ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో అప్పటి నుంచి ఆ వివాహిత పుట్టింట్టోనే ఉంటుంది.
ఈ క్రమంలోనే మహేష్ ఆ యువతికి మళ్లీ ఫోన్ చేసి మాట్లాడాట. దీనిపై స్పందించిన ఆ యువతి కుటుంబ సభ్యులు మహేష్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మహేష్ ను స్టేషన్ కు పిలిపించి కౌన్స్ లింగ్ ఇచ్చి పంపించారు. దీంతో మహేష్ మళ్లీ ఆ వివాహితను మాట్లాడాలంటూ వేధించాడని సమాచారం. అంతేకాకుండా ఆ మహిళకు అసభ్యకరమైన మెసేజ్ లు కూడా పంపినట్లు తెలుస్తుంది. దీంతో ఆ యువతి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఆగ్రహంతో ఊగిపోయారు. ఈ క్రమంలోనే మంగళవారం ఉదయం మహేష్ ను పట్టుకుని ముందుగా కత్తితో పొడిచారు. ఆ తర్వాత బండరాయితో తలపై బలంగా బాది మహేష్ ను పాశవికంగా హత్య చేశారు. తాజాగా ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది.