కలికాలమంటే ఇదే!! తాగొచ్చి భార్యలను కొట్టే భర్తలు – వరకట్నం కోసం వేధించే అత్తమామలు.. చీటికిమాటికీ తగవులు పెట్టుకునే ఆడపడుచులతో ఎలా వేగుతుందోనని అమ్మాయిని అత్తారింటికి పంపాలంటే భయపడిపోయే రోజులు పోయి భార్య వేధింపులు తాళలేక భర్త ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు దాపురించాయి. భార్య వేస్తున్న వేషాలు చూడలేక ఓ భర్త నలిగిపోయాడు. దీనికితోడు భర్త ఎదుటే ప్రియుడితో సన్నిహితంగా ఉంటూ మరింత వేధించసాగింది. భార్య పద్ధతి మార్చుకోకపోవడంతో తనలో తానే చిద్రవధ అనుభవించి చివరికి బలవంతంగా ప్రాణాలు తీసుకున్న అత్యంత విషాద ఘటన వెలుగుచూసింది.ఖమ్మం జిల్లా కొణిజర్లకు చెందిన కిన్నెర జాంబవంతుడు రామనర్సయ్యనగర్‌కు చెందిన మహిళను పెళ్లి చేసుకుని నాలుగేళ్ల నుంచి అక్కడే ఉంటున్నాడు.భార్య మరో వ్యక్తితో వివాహేతర సంబంధం సాగిస్తూ జాంబవంతుడి తో నిత్యం గొడవ పడేది. దీంతో మనస్తాపానికి గురైన అతడు ఆదివారం రాత్రి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి ఓ కూతురు ఉంది. జాంబ వంతుడు తండ్రి లక్ష్మయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఖమ్మం తరలించారు.
విచారణలో మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.