మనసు ఉంటే మార్గం ఉంటుందన్నది అందరికీ తెలిసిన విషయమే. అయితే, ఆ మనసు ఎలాంటి పనుల కోసం మార్గం వెతుకుతోందన్నది పాయింటు. మంచి పనులకోసం అయితే, అందరూ మెచ్చుకుంటారు. చెడు పనుల కోసం అయితే, ఇబ్బందులు తప్పవు. మనం చేసే పని ఎంత క్రియేటివిటీ, నేర్పుతో కూడిందైనా తప్పు, తప్పే శిక్ష తప్పదు. ఎంత క్రియేటివిటీతో దొంగతనం చేసినా.. చివరకు జైలు పాలుకావాల్సిందే. ఇప్పుడు మనం చెప్పకోయేది కూడా క్రియేటివిటీకి కేరాఫ్ అడ్రస్ అయిన ఓ దొంగ గురించి. అతడు రబ్బర్ బ్యాండుతో దొంగతనం చేయటం మొదలుపెట్టాడు. కార్ల అద్దాలను బద్దలు కొట్టి దొంగతనం చేయసాగాడు. చివరకు పాపం పండి జైలు పాలయ్యాడు. దాదాపు సంవత్సరం క్రితం జరిగిన రబ్బర్ బ్యాండ్ దొంగతనానికి సంబంధించిన వీడియో మరోసారి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
గతంలో తమిళనాడుకు చెందిన కొంతమంది వ్యక్తులు ఆపి ఉన్న కార్లను టార్గెట్ చేశారు. రబ్బర్ బ్యాండ్లతో వాటి అద్దాలను బద్ధలు కొట్టి లోపల ఉన్న విలువైన వస్తువులను దొంగిలించటం మొదలుపెట్టారు. చివరకు పోలీసులకు చిక్కారు. పోలీసులు వారిని పట్టుకున్న తర్వాత ఎలా దొంగతనం చేసేవారో డెమో చూపించమన్నారు. వాళ్లు చేసి చూపించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆ వీడియోలో.. ఓ వ్యక్తి రబ్బరు బ్యాండుతో కారు అద్దంపై గట్టిగా కొడతాడు. దీంతో కారు అద్దం బద్దలు అవుతుంది. అది చూసి పోలీసులు కూడా నోరెళ్ల బెడతారు. మరి, సోషల్ మీడియాలో మరో సారి వైరల్‌గా మారిన ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.