FB: ఫేస్‌బుక్‌లో ఫాలోవర్స్ పెరగటం కోసం ఓ వ్యక్తి పాడుపని చేశాడు. భార్యను బలిపశువుగా మార్చాడు. ఆమె స్నానం చేసే ఫొటోలను తీసి ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ చేశాడు. చివరకు భార్య ఆగ్రహానికి గురై పోలీస్ కేసులో ఇరుక్కున్నాడు. ఈ సంఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఢిల్లీలోని ఉత్తమ్ నగర్‌కు చెందిన ఓ వ్యక్తి అదే ప్రాంతంలోని ఓ సర్కస్ కంపెనీలో పనిచేస్తున్నాడు. అతడికి ఫేస్‌బుక్ అంటే పిచ్చి. దానికి పూర్తిగా బానిసగా మారిపోయాడు.
కొన్ని సార్లు భార్యాభర్తలు కలిసి ఫేస్‌బుక్ లైవ్‌లోకి వచ్చేవారు. ఫాలోవర్స్‌లో వీడియో చాట్స్ చేసేవారు. ఓ రోజు భార్య బాత్ టబ్‌లో స్నానం చేస్తుండగా భర్త ఫొటోలు తీశాడు. అనంతరం భార్యకు తెలియకుండా వాటిని ఫేస్‌బుక్‌లో రిలీజ్ చేశాడు. అయితే, కొన్ని రోజుల తర్వాత భార్యకు ఈ విషయం తెలిసింది. భర్తను నిలదీసింది. ఫాలోవర్స్ పెరుగుతారన్న ఉద్దేశ్యంతో అలా చేశానని సమాధానం ఇచ్చాడు.
ఫేస్‌బుక్ నుంచి ఫొటోలు తీసేయాలని ఆమె కోరింది. అయినా అతడు పట్టించుకోలేదు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. భర్తపై ఫిర్యాదు చేసింది. భర్తపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, ఫొటోలను తీసేశారు. భార్యాభర్తల్ని విచారణకు పిలుస్తామని, ఆ తర్వాతే తగిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ పేర్కొన్నారు. మరి, ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : అక్క కూతురని కష్టపడి పెంచింది! కానీ.. ప్రియుడి కోసం పిన్నిని!