కొందరు వ్యక్తులకు వయసు పెరిగినా బుద్ది మాత్రం మారటం లేదు. మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించటమే కాకుండా శారీరక కోరికలు తీర్చుకునేందుకు వేధింపులకు గురి చేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే రంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మొయినాబాద్ మండలంలోని ఓ గ్రామంలో ఓ మహిళా డాక్టర్ సొంతంగా క్లినిక్ ను నడిపిస్తుంది. ఆ గ్రామంలోని వ్యక్తులకు ఎలాంటి ఆరోగ్యపరమైన సమస్యలు వచ్చినా చికిత్స అందిస్తూ డాక్టర్ గా సేవలు అందిస్తుంది.
ఇక అదే గ్రామంలో పాటి ప్రసాద్ రెడ్డి అనే వ్యక్తి ఎప్పటి నుంచో ఆ డాక్టర్ పై కన్నేశాడు. దీంతో ఓ రోజు ఆమె క్లినిక్ వెళ్లి ఆరోగ్యం సరిగ్గా లేదని చికిత్స కావాలంటూ వెళ్లాడు. ఇక ఇంతటితో ఆగకుండా మళ్లీ ఏమైన హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే కాల్ చేస్తానంటూ ఆ మహిళ ఫోన్ నెంబర్ కూడా తీసుకున్నాడు. ఇక అప్పటి నుంచి ఆ యువతికి ఫోన్ లు చేసి విసిగించటమే కాకుండా అసభ్యకరమైన మెసెజ్ లు, ఫోటోలు పంపుతూ ఆ మహిళను వేధించటం మొదలు పెట్టాడు.
ఇక ఓ రోజు ఏకంగా ఆమె క్లినిక్ వెళ్లి నువ్వంటే నాకు ఇష్టమని, నిన్ను ప్రేమిస్తున్నానంటూ తెలిపాడు. ఇక దీంతో పాటు నాకు ఒక ముద్దు ఇస్తే రూ. 25 రూపాయలు, 5 నెలల పాటు ఈ షెటర్ కు రెంట్ కూడా కడతానంటూ ఆఫర్ ఇచ్చాడు. ఇక మనోడి వేషాలను గ్రహించిన ఆ మహిళ ఇంటికి వెళ్లి తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో వెంటనే ఆ కామంధుడి అంతం చూసేందుకు ఆ మహిళ తల్లిదండ్రులు పరుగు పరుగునా ప్రసాద్ రెడ్డి ఇంటికి కదిలారు.
ఇక ఇంటికెళ్లి చూస్తే.. తాళం వేసి పరారీలో ఉన్నాడు. దీంతో అటు నుంచే తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ కు వెళ్లి అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక ప్రసాద్ రెడ్డిపై నిర్భయ కేసుతోపాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదు చేశారు. ఇక పరారీలో ఉన్న ప్రసాద్ రెడ్డి వెతికి పట్టుకునేందుక పోలీసులు రంగంలోకి దిగారు.