Crime News In Telugu: యువతికి మత్తు మందు ఇచ్చి అఘాయిత్యానికి పాల్పడ్డానికి చూశాడో యువకుడు. అయితే, అతడి ప్రయత్నం విఫలమైంది. గ్రామస్తులకు అడ్డంగా దొరికిపోయాడు. వారి చేతిలో దారుణమైన శిక్ష అనుభవించాడు. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్‌లో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఉత్తర ప్రదేశ్, మహారాజ్ గంజ్ జిల్లా, కోహ్లీ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన ఓ యువకుడు అదే ప్రాంతానికి చెందిన ఓ యువతిపై కన్నేశాడు. ఆమెను ఎలాగైనా అనుభవించాలని అనుకున్నాడు.
ఇందుకోసం ఓ ప్లాన్ వేశాడు. కొద్దిరోజుల క్రితం ఆమెకు మత్తు మందు కలిపిన ఆహార పదార్ధాలు ఇచ్చాడు. అవి తిన్న ఆమె స్ప్రహ కోల్పోయింది. ఇదే అదనుగా భావించిన యువకుడు, యువతిపై అఘాయిత్యానికి ప్రయత్నించాడు. అయితే, ఇది గమనించిన గ్రామస్తులు యువకుడ్ని అడ్డుకున్నారు. ఆపై యువకుడ్ని దారుణంగా చితకబాదారు. అనంతరం అతడి మెడలో చెప్పుల దండ వేసి ఊరేగించారు. అతడు వద్దని ఎంత ప్రాథేయపడినా వారు వినలేదు.
కొడుతూ.. ఊరంతా ఊరేగించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియో ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితులను వీడియో ఆధారంగా గుర్తించామని చెప్పారు. దాడికి పాల్పడిన వారిపై తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : నచ్చిన వాడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది.. చివరికి విషాదం ఏంటంటే?