పెళ్లి కోసం మాట్రిమొనీ సైట్‌ను ఆశ్రయించిన ఓ వ్యక్తికి జీవితంలో మర్చిపోలేని అనుభవం ఎదురైంది. ఆ సైట్ ద్వారా అతడు పెళ్లి చేసుకున్న మహిళ గురించి తెలిసి దిమ్మ తిరిగిపోయింది. గూగుల్లో సైతం ఫేమస్ అయిన ఆమె ఎవరో పూర్తిగా అర్థమై గుండె పట్టుకున్నాడు.
ఈ మధ్యకాలంలో పెళ్లిళ్లు చేసుకోవటానికి జనం ఎక్కువగా మాట్రిమొనీ సైట్ల మీద ఆధారపడుతున్నారు. తమకు నచ్చిన వారిని ఆయా మాట్రిమొనీ సైట్ల ద్వారా ఏరికోరి పెళ్లి చేసుకుంటున్నారు. అయితే, మాట్రిమొనీ సైట్ల ద్వారా అయ్యే పెళ్లిళ్లలో కొన్ని మాత్రమే జెన్యూన్‌గా ఉంటున్నాయి. చాలా వరకు ఫేక్ అకౌంట్లే దర్శనమిస్తున్నాయి. తప్పుడు సమాచారం ఇచ్చి పెళ్లిళ్లు చేసుకునే వారు ఎక్కువయిపోయారు. తాజాగా, ఓ వ్యక్తి మాట్రిమొనీ సైట్ ద్వారా పెళ్లి చేసుకుని షాక్ తిన్నాడు. తాను పెళ్లి చేసుకున్న ఆమె ఓ వాంటెడ్ క్రిమినల్ అని తెలియగానే గుండె పట్టుకున్నాడు. ఈ సంఘటన గుజరాత్‌లో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు, బాధితుడు తెలిపిన వివరాల మేరకు.. గుజరాత్‌కు చెందిన విమల్ కరియాకు మాట్రిమొనీ సైట్ ద్వారా రీతా దాస్ అనే మహిళ పరిచయం అయింది.
ఇద్దరూ ఫోన్లలో మాట్లాడుకుంటూ ఉండేవారు. తనకు ఇదివరకే పెళ్లి అయిందని, భర్తతో విడాకులు తీసుకున్నానని ఆమె చెప్పింది. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. పెళ్లికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మొదటి భర్తతో విడాకులు తీసుకున్నట్లు పేపర్లు తీసుకురమ్మని విమల్ కోరాడు. అయితే, తనకు గ్రామ పంచాయతీలో పెళ్లి అయిందని చెప్పి ఆమె తప్పించుకుంది. ఈ విషయాన్ని విమల్ కూడా పెద్దగా పట్టించుకోలేదు. ఇద్దరూ అస్సాం నుంచి గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు వెళ్లి పెళ్లిచేసుకున్నారు. ఇక, అప్పటినుంచి అక్కడే ఉండేవారు.
పెళ్లయిన ఆరు నెలల తర్వాత రీతా అస్సాంకు బయలుదేరింది. స్థలం గొడవ కారణంగా అస్సాం వెళుతున్నట్లు విమల్‌కు చెప్పింది. ఆమె వెళ్లిన తర్వాత విమల్‌కు ఓ ఫోన్ వచ్చింది. తాను రీతా లాయర్‌ను అని, రీతా ఓ కేసులో ఇరుక్కుందని ఫోన్ చేసిన వ్యక్తి చెప్పాడు. ఆమెను విడిపించాలంటే లక్ష రూపాయలు కావాలని అన్నాడు. విమల్ లక్ష రూపాయలు కట్టాడు. అయితే, రీతా కోర్టు పేపర్లను చదివిన అతడికి అనుమానం వచ్చింది. ఆ కోర్టు పేపర్లలో రీతా చౌహాన్ అని ఉంది. దీంతో అతడు పేరు మీద ఉన్న తికమకను నివృతం చేసుకోవాలని అనుకున్నాడు. భార్యకు ఫోన్ చేసి ఈ విషయాన్ని అడిగాడు. ఆమె దాన్ని దాట వేసే ప్రయత్నం చేసింది. అతడు పదే పదే ఈ విషయాన్ని అడగటంతో ఫోన్ ఎత్తటం మానేసింది.
తర్వాత అతడి నెంబర్‌ను బ్లాక్ చేసింది. దీంతో విమల్‌కు భార్యపై అనుమానం మరింత పెరిగింది. ఆమె గురించి ఎలాగైనా తెలుసుకోవాలని భావించాడు. గూగుల్‌లో ఆమె పేరును సెర్చ్ చేశాడు. రీతా గురించి వచ్చిన సమాచారం చూసి షాక్ అయ్యాడు. తన భార్య మోసం, దొంగతనం, హత్య, వేట వంటి నేరాల్లో నిందితురాలని తెలిసి గుండె పట్టుకున్నాడు. ఆమెకు ఇది వరకే అనిల్ చౌహాన్ అనే వ్యక్తితో పెళ్లి అయిందని, ఇద్దరూ కలిసి దాదాపు 6000 కార్లను దొంగతనం చేశారని తేలింది. అయితే, తనకు అనిల్ చౌహాన్‌కు ఎలాంటి సంబంధం లేదని రీతా చెబుతోంది. విమల్ మాత్రం తాను మోసపోయానని తెలిసి బాధపడుతున్నాడు. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.