సాధారణంగా పోలీసులకు సంబంధించిన ఏ విషయాల్లో అయినా దొంగలు లేదా ఇతర సైబర్ నేరగాళ్లు చాలా జాగ్రత్తగా ఉంటారు. పోలీసులు ఉండే వైపు తల పెట్టి కూడా పడుకోరు. అలాంటిది ఓ వ్యక్తిని భార్యను ఇంప్రెస్ చేయటానికి పోలీసులతో పెట్టుకున్నాడు. చివరకు..
పెళ్లి తర్వాత భార్యాభర్తల మధ్య ఇబ్బందులు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. భార్య కోర్కెల్ని తీర్చటం భర్త వల్ల కాకపోతే ఆ అసంతృప్తి అలాగే మిగిలిపోతుంది. భార్యంటే ఇష్టం ఉన్నవాళ్లు వాళ్లను మచ్చిక చేసుకోవటానికి ప్రయత్నిస్తూ ఉంటారు. వాళ్లకు ఇష్టమైన లేదా అవసరమైన పనులు చేస్తూ ఉంటారు. తాజాగా, ఓ వ్యక్తి తన భార్యను ఇంప్రెస్ చేయటానికి ఏకంగా పోలీసులతో పెట్టుకున్నాడు. పోలీసుల డేటా బేస్‌లోకి వెళ్లి భార్య పాస్‌పోర్టుకు సంబంధించిన వివరాలను మార్చాడు. చివరకు పోలీసులకు దొరికిపోయాడు. ఈ సంఘటన మహారాష్ట్రలోని ముంబైలో చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఉత్తర ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌కు చెందిన 27 ఏళ్ల రాజాబాబు షా సివిల్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. ఇంతడికి కొన్నేళ్ల క్రితం పెళ్లయింది. అతడి భార్య వేరే దేశంలో ఉద్యోగం చేయాలని భావించింది. ముంబైకి వచ్చి ఆన్‌లైన్ ద్వారా పాస్‌పోర్టు కోసం అప్లై చేసుకుంది. ఆ పాస్‌పోర్టు అప్లికేషన్ వెరిఫికేషన్ కోసం ముంబై పోలీసుల దగ్గరకు వెళ్లింది. అయితే, ఏవో కారణాల వల్ల ఆమె అప్లికేషన్ హోల్డ్‌లో పడింది. రోజులు గడుస్తున్నా అప్లికేషన్‌కు అప్రూవల్ రాలేదు. దీంతో రాజాబాబు రంగంలోకి దిగి భార్య అప్లికేషన్‌ను ఎలాగైనా క్లియర్ చేయాలనుకున్నాడు.
అలా చేసి ఆమె మెప్పు పొందాలనుకున్నాడు. ఇందుకోసం ఏకంగా పోలీసుల జోలికే వెళ్లాడు. ముంబై పోలీసుల డేటా బేస్‌ను హ్యాక్ చేశాడు. భార్య అప్లికేషన్‌తో పాటు మరో ఇద్దరి అప్లికేషన్‌ను క్లియర్ చేశాడు. పాస్‌పోర్టు ఆఫీస్ మూసి ఉన్న రోజు ఈ అప్లికేషన్‌లు క్లియర్ అయ్యాయి. దీంతో పోలీసులకు అనుమానం వచ్చింది. తమ సిస్టమ్‌ను ఎవరో హ్యాక్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఐపీ అడ్రస్ ద్వారా నిందితుడు ఉత్తర ప్రదేశ్‌లో ఉన్నట్లు కనుగొన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. రాజాబాబును అరెస్ట్ చేశారు. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.