ప్రేమలో ఉన్నపుడు ప్రేమించిన వారితో కలిసి తిరగాలని, ఎక్కువ టైం స్పెండ్ చేయాలని అందరికీ ఉంటుంది. అయితే, తాహతను బట్టి కొంతమంది లాంగ్ డ్రైవ్‌లు, విదేశీ టూర్లకు వెళుతూ ఉంటారు. ప్రియురాలితో లాంగ్ డ్రైవ్ వెళ్లటానికి, విదేశీ పర్యటనలు చేయటానికి డబ్బులు లేని వారు.. లోకల్‌గానే ఏదో ఒక వీధి పట్టుకుని తిరుగుతూ ఉంటారు. ఇదంతా కొంతమంది విషయం.. ఇంకొంత మంది నచ్చిన వారితో లాంగ్ డ్రైవ్‌కు వెళ్లటానికి డబ్బులు లేకపోతే దొంగతనాలకు పాల్పడుతున్నారు. తాజాగా, ఓ యువకుడు ప్రియురాలితో గోవా ట్రిప్ వెళ్లటానికి ఏకంగా సొంతింటికే కన్నం వేశాడు. చివరకు చేసిన నేరం బయటపడి జైలు పాలయ్యాడు. ఈ సంఘటన కర్ణాటకలోని బెంగళూరులో చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బెంగళూరుకు చెందిన ఇర్ఫాన్ గత కొన్ని నెలలుగా అదే ప్రాంతానికి చెందిన ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. ఇద్దరూ పోటాపోటీగా ప్రేమించుకుంటున్నారు. ఈ సమయంలో ఓ రోజు గోవా ట్రిప్ వెళదామని నిశ్చయించుకున్నారు. గోవా ట్రిప్ అంటే మాటలు కాదు.. వేల రూపాయలు ఖర్చు అవుతుంది. అన్ని ప్రేమల్లోలానే డబ్బు బాధ్యత ఇర్ఫాన్‌పై పడింది. అయితే, అతడి వద్ద చాచి కొడితే చిల్లిగవ్వ కూడా లేదు. అయినా సరే, ప్రియురాలితో ఎంజాయ్ చేయాలన్న ఉద్ధేశ్యంతో ఓకే అన్నాడు. డబ్బుల కోసం అన్వేషించసాగాడు. ఎక్కుడా డబ్బు పుట్టలేదు. తనకు బయట ఎక్కడా డబ్బు దొరకదని డిసైడ్ అయి ఇర్ఫాన్ ఓ నిర్ణయానికి వచ్చాడు.
ఇంట్లో తల్లిదండ్రులు పైసాపైసా కూడబెట్టి కొన్న 103 గ్రాముల బంగారాన్ని దోచేయాలని నిశ్చయించుకున్నాడు. ఇందుకోసం ప్లాన్ చేసుకున్నాడు. తల్లిదండ్రులు నిద్రలో ఉన్నపుడు బంగారం దోచేశాడు. తర్వాత ప్రియురాలితో కలిసి గోవా ట్రిప్ వెళ్లాడు. ఇక్కడ ఇంట్లో బంగారం కనిపించకపోయే సరికి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విచారణలో ఇర్ఫాన్ బంగారాన్ని దొంగతనం చేసి, ప్రియురాలితో గోవా ట్రిప్ వెళ్లినట్లు తేలింది. పోలీసులు అతడ్ని అరెస్ట్ చేశారు. మరి, ప్రియురాలితో గోవా ట్రిప్ కోసం ఇంట్లో దొంగతనం చేసి జైలు పాలైన ఇర్ఫాన్ ఉదంతంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.