కుటుంబాల్లో గొడవలు అనేది సర్వసాధారణం. అయితే కొన్ని సార్లు ఈ గొడవలు పెద్దవిగా మారి కక్ష పెంచుకునే స్థాయిలో వెళ్తాయి. తాజాగా జాతరలో పట్టపగలు అందరూ చూస్తుండగా అల్లుడిని మామ అత్యంత దారుణంగా హత్య చేశాడు. అల్లుడు తీవ్రగాయాలతో ఘటనస్థలంలోనే కుప్పకూలి మృతి చెందాడు.
కుటుంబాల్లో గొడవలు అనేది సర్వసాధారణం. అయితే కొన్ని సార్లు ఈ గొడవలు పెద్దవిగా మారి కక్ష పెంచుకునే స్థాయిలో వెళ్తాయి. కొందరు వ్యక్తులు విచక్షణ కోల్పోయి కుటుంబ సభ్యులనే దారుణంగా హతమారుస్తుంటారు. తాజాగా అలాంటి ఘటనే కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది. పట్టపగలు జాతరలో అందరూ చూస్తుండగా అల్లుడిని కత్తితో నరికి చంపేశాడు. తీవ్రగాయలతో ఆ అల్లుడు నేలమీద కుప్పకూలిపోయి ప్రాణాలు వదిలాడు. ఈ ఘటన మామ ఇంటికి సమీపంలోనే చోటుచేసుకుంది. గత కొద్దిరోజులుగా కుటుంబాల్లో గొడవలు జరుగుతున్నట్లు, ఆ కారణంతోనే మామ ఈ హత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఇక వివరాల్లోకి వెళ్తే..
కర్నూలు జిల్లా దేవన కొండ మండలం పి.కోటకొండలో బుధవారం జాతర జరిగింది. ఈ జాతరకు చుట్టు పక్కల గ్రామాల నుంచి పెద్ద ఎత్తున జనాలు తరలి వచ్చారు. ఇక అందరూ జాతర సంబరాల్లో మునిగితేలుతున్నారు. ఇదే సమయంలో అకస్మాత్తుగా ఓ ఘోరమైన ఘటన చోటుచేసుకుంది. దీంతో అందరూ కొన్ని క్షణాల పాటు షాక్ లోనే ఉండిపోయారు. అందరూ చూస్తుండగా సూర్యప్రకాశ్ అనే వ్యక్తిన తన మామ లింగమయ్య కత్తులతో దాడి చేసి హత్య చేశాడు. అకస్మాత్తుగా మామ వచ్చి కత్తితో దాడి చేయడం సూర్యప్రకాశ్ ఘటనా స్థలంలోనే కుప్పకూలి చనిపోయాడు.
సూర్య ప్రకాశ్ భార్య ప్రస్తుతం ఎనిమిది నెలల గర్భిణి. గత కొంతకాలంగా కుటుంబంలో గొడవలు జరుగుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే మామ లింగమయ్య అల్లుడు సూర్యప్రకాశ్ కక్ష పెంచుకున్నట్లు తెలుస్తోంది. జాతరలో పాల్గొన్న అల్లుడి హత్య చేయాలని భావించిన లింగమయ్య.. పక్క ప్రణాళికను సిద్ధం చేసుకున్నాడు. అనుకున్నట్లు గానే సూర్యప్రకాశ్ జాతరకి రావడం.. ముందే సిద్ధం చేసుకున్న కత్తులతో లింగమయ్య దాడికి పాల్పడటం క్షణాల్లో జరిగిపోయింది. గ్రామంలో తిరునాళ్ల సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఇంత బందోబస్తు ఉన్న కూడా హత్య జరగడం స్థానికంగా కలకలం రేపింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. సూర్యప్రకాష్ మరో అమ్మాయితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈక్రమంలోనే కొన్ని నెలలుగా తన కుమార్తెను వేధిస్తున్నాడని సూర్యప్రకాష్ మామ కోపం పెంచుకున్నాడు. గతంలో పెద్దల సమక్షంలో పంచాయితీ కూడా జరిగింది. ఇటీవలే సూర్యప్రకాష్ అత్తారింటికి వచ్చి.. తన భార్యను తీసుకెళ్తానని కుటుంబ సభ్యులను అడిగాడు. జాతర ఉందని.. అయ్యాక పంపుతామని వారు చెప్పారు. ఈ క్రమంలోనే మాటామాట పెరిగి ఘర్షణ జరిగిందని తెలుస్తోంది. మరి.. ఈ ఇలా పట్టపగలు మనిషిని చంపుతున్న ఘటనలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.