దివగర్ లేడీ అవతారం ఎత్తాడు. మహిళల దగ్గరి నుంచి న్యూడ్ ఫొటోలు, వీడియోలు సేకరించారు. ఆ వీడియోలు దొరికిన తర్వాత వాటిని అడ్డుపెట్టుకుని వారిని బెదిరించటం మొదలుపెట్టాడు.
ఈ మధ్య కాలంలో ఆన్‌లైన్ మోసాలు ఎక్కువయిపోయాయి. ముఖ్యంగా సోషల్ మీడియా ప్లాట్ ఫాంల ద్వారా ఇతరులను మోసం చేయటం చాలా ఈజీ అయిపోయింది. ఫేక్ ప్రోఫైల్స్‌తో ఎదుటి వ్యక్తిని నమ్మించి, ముంచేస్తున్నారు. తాజాగా, ఓ 22 ఏళ్ల కుర్రాడు.. లేడీ ఫిట్‌నెస్ ట్రైనర్ అవతారం ఎత్తి పదుల సంఖ్యలో మహిళల్ని మోసం చేశాడు. వారినుంచి న్యూడ్ ఫొటోలు, వీడియోలు సేకరించాడు. ఈ సంఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. తమిళనాడులోని, పుదుచ్చేరికి చెందిన 22 ఏళ్ల దివగర్ కొన్ని నెలల క్రితం లేడీ పేరిట ఓ ఫేక్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ను క్రియేట్ చేశాడు.
తాను ఓ ఫిట్‌నెస్ కోచ్‌నని, లావుగా ఉన్న వారు మంచి సేప్‌కు వచ్చేలా ఉచితంగా సలహాలు ఇస్తానని తన ఫాలోయర్స్‌గా ఉన్న మహిళలను నమ్మించాడు. ఇందుకోసం న్యూడ్ ఫొటోలు, వీడియోలు పంపాలని కోరాడు. తమను ఫొటోలు, వీడియోలు అడుగుతున్నది లేడీ అని భావించిన మహిళలు ఎలాంటి భయంగా లేకుండా వాటిని పంపారు. న్యూడ్ ఫొటోలు, వీడియోలు దొరికిన వెంటనే దివగర్ మరికొన్ని ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేశాడు. వాటి ద్వారా న్యూడ్ ఫొటోలు, వీడియోలు పంపిన మహిళలను బెదిరించటం మొదలుపెట్టాడు. తనతో న్యూడ్ వీడియో కాల్ మాట్లాడాలని వేధించేవాడు. ఈ నేపథ్యంలోనే ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దివగర్‌ను అదుపులోకి తీసుకున్నారు.
అతడి నుంచి పూర్తి వివరాలు సేకరించారు. దీనిపై జిల్లా ఎస్పీ విష్ణు కుమార్ మాట్లాడుతూ.. ‘‘ కొంతమంది సోషల్ మీడియాలో ఫేక్ ఎకౌంట్లు క్రియేట్ చేస్తున్నారు. మహిళల ఫొటోలు, వీడియోలు సేకరిస్తున్నారు. వాటి ద్వారా ఇతర మహిళలను మోసం చేయటానికి ప్రయత్నిస్తున్నారు. సోషల్ మీడియాలో ఇతరుల పూర్తి వివరాలు తెలిసేంత వరకు, అవి నిజాలే అని ధ్రువీకరణ అయ్యేంత వరకు మీకు సంబంధించిన వ్యక్తిగత వివరాలు, ఫొటోలు, వీడియోలు పంపకండి’’ అని హెచ్చరించారు. మరి, లేడీ ట్రైనర్ అవతారం ఎత్తి మహిళలను మోసం చేసిన దివగర్ ఉదంతంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.