ఒక వ్యక్తి పాఠశాలలోకి ప్రవేశించి విద్యార్థులను చంపేస్తా అంటూ తుపాకీతో బెదిరించడం కలకలం రేపింది. దీంతో చాలా సేపు హైడ్రామా కొనసాగింది. కానీ అతను అలా చేయడం వెనుక ఒక కారణం ఉంది. అదేంటంటే?
గుర్తు తెలియని వ్యక్తి పాఠశాలలోకి చొరబడ్డాడు. 8వ తరగతి గదిలోకి వెళ్లి టీచర్ లా కూర్చున్నాడు. బ్యాగ్ లోంచి తుపాకీ తీసి చేత్తో పట్టుకుని.. గట్టిగా అరుస్తూ చంపేస్తా క్లాస్ టీచర్ ని, విద్యార్థులను చంపేస్తా అంటూ బెదిరించాడు. దీంతో విద్యార్థులు, టీచర్ భయభ్రాంతులకు గురయ్యారు. ఈ విషయం విద్యార్థుల తల్లిదండ్రులకు తెలియడంతో వారు పాఠశాలకు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. తమ పిల్లలకు ఏమవుతుందో అని ఆందోళనకు గురయ్యారు. పోలీసులు రంగంలోకి దిగి ఆ వ్యక్తిని చాకచక్యంగా పట్టుకున్నారు. ఆ వ్యక్తి నుంచి తుపాకీతో పాటు బ్యాగ్ లో ఉన్న రెండు లిక్విడ్ బాటిల్స్, ఒక కత్తి స్వాధీనం చేసుకున్నారు. దీంతో విద్యార్థులు, టీచర్లు, విద్యార్థుల తలిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.
ఈ ఘటన పశ్చిమ బెంగాల్ లో చోటు చేసుకుంది. దేవ్ వల్లభ్ అనే వ్యక్తి మాల్దా జిల్లాలోని ఉన్నత పాఠశాలలోకి అక్రమంగా చొరబడి తుపాకీతో బెదిరింపులకు పాల్పడ్డాడు. తన భార్య రీటా, కొడుకు రుద్ర కనిపించడం లేదని ఏడాది క్రితం పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదనతో ఆ వ్యక్తి ఇలా చేసినట్టు పోలీసులు వెల్లడించారు. విద్యార్థులను, టీచర్ ను చంపేస్తా అని బెదిరిస్తే తన భార్య, కొడుకుని పోలీసులు వెతికి పెడతారని ఆశ పడ్డాడు. ఒత్తిడి తీసుకురావడం ద్వారా తన సమస్యకు పరిష్కారం చూసుకోవాలనుకున్నాడు. కానీ అదే అతని పాలిట పెద్ద సమస్యగా మారింది. ఉన్న సమస్యకు మరో సమస్య తోడైంది. నిందితుడ్ని పట్టుకోవడంలో పోలీసులు చేసిన సాహసానికి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రశంసించారు.
ఒక్కోసారి మంచి వ్యక్తులు కూడా కొన్ని కారణాల వల్ల చెడ్డవాళ్లుగా మారాల్సి వస్తుంది. తన భార్య, కొడుకు కనబడడం లేదని ఏడాది నుంచి పోలీసుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోలేదు. పిల్లలను భయపెట్టడం ద్వారా ఒత్తిడి తీసుకొచ్చి.. తన భార్య, కొడుకులను పోలీసులు వెతుకుతారని ఇలా చేశాడు. పోలీసులు ముందు కరెక్ట్ గా పని చేసి ఉంటే అతను ఇలా అయ్యేవాడా? అతను మాత్రం ఉన్న సమస్యను పరిష్కరించుకోకుండా కొత్త సమస్యను తెచ్చి మీద వేసుకోవడం కరెక్టా? పోలీసులు తన సమస్యను పట్టించుకోవడం లేదని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయాలి గానీ తప్పు చేస్తే ఎలా? తప్పు చేసిన వాళ్ళని సరిదిద్దడం మానేసి తప్పు చేస్తే తేడా ఏముంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి ఒక వ్యక్తి ఇలా తుపాకీతో పాఠశాలలోకి ప్రవేశించడం పట్ల మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.
#WATCH | Malda, WB | A gun-wielding man, Deb Ballabh, tried to hold hostage students in a classroom of Muchia Anchal Chandra Mohan High School. He was later overpowered & arrested by Police. No one was injured in the incident. A police probe is underway
(Note: Abusive language) pic.twitter.com/86OU8Cw8Np
— ANI (@ANI) April 26, 2023