టూ వీలర్ అనేది ప్రస్తుతం నిత్యావసరంగా మారిపోయింది. ఎక్కడికైన ప్రయాణించాలంటే టక్కుమని గుర్తొచ్చేది బైక్ మాత్రమే. ఉద్యోగస్తులు, చిరువ్యాపారులు మొదలుకొని వివిధ వృత్తుల పనివారు ఎక్కువగా బైక్ లనే వాడుతుంటారు. ఈ క్రమంలో ఓ చిరుద్యోగి, టూ వీలర్ పై తన కొడుకు ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా విచ్చలవిడిగా తిరగడంతో చలాన్లు పెరిగిపోయాయి. దీంతో పోలీస్ వారు ఆ బండిని తీసుకెల్లారు. దీని తర్వాత ఏం జరిగింది..? ఆ తండ్రి ఏం చేశారు..? అనేది ఇప్పుడు చూద్దాం!

ప్రమాదాల నివారణలో భాగంగా బైక్ నడిపేటపుడు హెల్మెట్ ధరించాలని, ట్రిపుల్ రైడింగ్ చేయవద్దని ట్రాఫిక్ పోలీసులు పదేపదే చెప్తూనే ఉంటారు. కానీ వారి సూచనలను పట్టించుకోకుండా వాహనదారులు నిబంధనలు ఉల్లఘించి వాహనాలను నడుపుతూ చలాన్ల భారిన పడుతుంటారు. ఇదే విధంగా ఓ చిరుద్యోగి కుమారుడు ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా బైక్ రైడ్ చేయడంతో చలాన్లు పెరిగిపోయాయి. పెండింగ్ చలాన్లు చెల్లించకపోయే సరికి ట్రాఫిక్ పోలీసు వారు బండిని తీసుకెల్లారు. బండి లేకపోతే తాను డ్యూటీ కి వెళ్లలేనని మనస్థాపంతో ఆ ఉద్యోగి పురుగుల మందు తాగాడు. ఈ ఘటన వరంగల్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మల్లారెడ్డి పల్లికి చెందిన పాలకుర్తి మొగిళి వరంగల్ లోని ఓ బట్టల దుఖానంలో సేల్స్ మెన్ గా పనిచేస్తున్నారు.
ప్రతి రోజు మల్లారెడ్డి పల్లె నుంచి వరంగల్ కు వెళ్లి విధులు నిర్వహించుకుని తిరిగి రాత్రి ఇంటికి చేరుకునే వాడు. ఇతని కుమారుడు సూర్య అదే బైక్ పై నిబంధనలు విరుద్దంగా ప్రయాణించడంతో చలాన్లు విధించారు. ఈ నెల 21వ తేదీన ట్రాఫిక్ పోలీసులు వాహన తనిఖీలు చేస్తుండగా వీరి బైక్ పట్టుబడింది. ఆ బండి నెంబర్ పై చలాన్లు పెండింగ్ ఉన్నాయని అవి చెల్లించి బండి తీసుకెల్లాలని పోలీసులు సూచించారు. దీంతో బైక్ లేకపోతే తను విధులకు వెళ్లలేనని పాలకుర్తి మొగిళి మనస్థాపంతో పురుగుల మందు తాగాడు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు వరంగల్ లోని ఎంజిఎం హాస్పిటల్ కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు. ఇదిలా ఉండగా మొగిళి చావుకు ట్రాఫిక్ పోలీసులే కారణమని కుటుంబసభ్యులు, కొడుకు సూర్య ఆరోపిస్తూ హసన్ పర్తి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.