వేద మంత్రాల సాక్షిగా.. పెద్దల ఆశీర్వాదంతో వివాహబంధంతో ఒక్కటైన దంపతులు కొద్ది రోజుల్లో బేదాభిప్రాయాలతో విడిపోతున్నారు. క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాల కోర్టు వరకు వెళ్లి విడాలకులు తీసుకుంటున్నారు. కొంతమంది వివాహేతర సంబంధాలతో పచ్చని సంసారాల్లో నిప్పులు పోసుకుంటున్నారు.
పెళ్లంటే ఒకరికొరు తోడూ నీడగా జీవిత కాలం కలిసి ఉండటానికి పెద్దలు నిశ్చయించిన పవిత్ర కార్యం వివాహబంధం. వేద మంత్రాల సాక్షిగా వివాహబంధంతో భార్యాభర్తలుగా సమాజపరంగా, చట్ట ప్రకారం ఏకమౌతారు. వివాహబంధం జీవితానికి ఒక భరోసా ఇస్తుందని అందరూ నమ్ముతారు. కానీ ఈ మద్య పెళ్లైన కొాద్ది కాలానికే.. ఒకరిపై ఒకరు నిందలు వేసుకోవడం.. డామినేషన్, ఆర్థిక వ్యవహారాలు ఇలా కారణాలు ఏవైనా పెళ్లైన కొద్దిరోజులకే విడాకుల కోసం కోర్టుకు వెళ్తున్నారు. కొంతమంది ఒకరిపై ఒకరు దాడులకు తెగబడుతున్నారు. తాజాగా ఓ భర్త తన భార్యని అతి దారుణంగా బీర్ సీసాతో తలపై బాది చంపడానికి యత్నంచాడు.. స్థానికులు రావడంతో అక్కడ నుంచి పారిపోయాడు. ఈ ఘటన ఎన్టీఆర్ జిల్లా చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
ఎన్టీఆర్ జిల్లా నందిగామ లో నివాసం ఉంటున్న శ్రీలక్ష్మి, ఆంజనేయులు పెళ్లయిన కొద్ది కాలానికే వీరి మద్య అభిప్రాయ బేధాలు వచ్చాయి. భర్త ఎప్పుడూ తన మాట వినడని.. మద్యం సేవించి విచక్షణ లేకుండా దారుణంగా తనను కొడతాడని, ఎప్పుడూ డబ్బులు ఇవ్వాలని బలవంతం చేస్తాడని.. ఆ బాధలు భరించలేక కొంతకాలం తల్లిగారి ఇంట్లో ఉంది. ఆ తర్వాత వేరే గది తీసుకొని ఒంటరిగా జీవిస్తుంది. ఈ క్రమంలో ఆంజనేయులు ఒంటరిగా ఉన్న శ్రీలక్ష్మి పై అత్యంత దారుణంగా దాడి చేశాడు. పీకలదాకా మద్యం సేవించిన ఆంజనేయులు బీరు సీసాతో శ్రీ లక్ష్మి తలపై బలంగా కొట్టాడు. ఈ దాడిలో శ్రీలక్ష్మి తీవ్రంగ గాయపడింది. భర్త దాడి చేసే సమయంలోనే కేకలు వేయడంతో స్థానికులు వచ్చారు.
చుట్టుపక్కల వాళ్లు రావడంతో భయంతో ఆంజనేయులు అక్కడ నుంచి పరారయ్యాడు. తీవ్రంగా గాయపడిన శ్రీ లక్ష్మిని స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ విషయాన్ని పోలీసులు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు శ్రీ లక్ష్మి వద్దకు వచ్చారు. ఆమె భర్త ఆంజనేయులుపై నందిగాం పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీ లక్ష్మి మాట్లాడుతూ.. పెళ్లైన కొద్ది రోజులకే నా భర్త అసలు రూపం బయట పడింది. నా భర్త ఒక జేబుదొంగ.. ఎప్పుడూ జైలుకు వెళ్లడం పరిపాటైంది.. అంతేకాదు రోజూ మద్య సేవించి నన్ను విపరీతంగా కొట్టడం.. హింసించడం అలవాటైంది. అక్కడే ఉంటే నా ప్రాణాలకు ప్రమాదం అని అమ్మ వాళ్ల ఇంటి దగ్గర ఇల్లు అద్దెకు తీసుకొని నివాసం ఉంటున్నాను. ఈ క్రమంలో నా భర్త విపరీతంగా తాగి వచ్చి దాడి చేశాడని’ కన్నీరు పెట్టుకుంది.