Goa Beach: ఎచ్చులుకు పోయి రొచ్చులో పడటం అంటే ఇదే.. గోవా బీచులో కారుతో విన్యాసాలు చేసి అందరి దృష్టిని ఆకర్షించాలని చూసిన ఓ వ్యక్తి అభాసుపాలయ్యాడు. బీచులోని ఇసుకలో కూరుకుపోవటమే కాక, బీచులో కారు నడిపినందుకు చివరకు కటకటాల పాలయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కొద్దిరోజుల క్రితం ఢిల్లీకి చెందిన లలిత్ కుమార్ దయాల్ అనే ఓ వ్యక్తి గోవా పర్యటనకు వెళ్లాడు. గురువారం అక్కడి ప్రముఖ అంజునా బీచ్‌లోకి కారుతో వెళ్లాడు. లోపలికి వెళ్లగానే కారుతో విన్యాసాలు చేయటం మొదలుపెట్టాడు. తాను కారు నడిపే టాలెంట్‌ను అందరికీ చూపించాలనుకున్నాడు. కారును బీచులో గిరాగిరా తిప్పుతూ ఉన్నాడు. కొద్ది సేపటి తర్వాత ఆ కారు కాస్తా అదుపుతప్పి ముందుకు దూసుకుపోయింది.
అక్కడి నీటిలోని ఇసుకలోకూరుకుపోయింది. చావు తప్పి కన్ను లొట్టపోయినట్లు అయింది పరిస్థితి. వెంటనే కిందకు దిగాడు. కారును బయటకు లాగేందుకు ప్రయత్నించాడు. అతడి వల్ల కాలేదు. ఇక, చేసేది ఏమీ లేక అక్కడి వాళ్లను సహాయం కోసం ప్రార్థించాడు. చుట్టుపక్కలి జనం వచ్చి సహాయం చేశారు. కారును బయటకు తీసుకువచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ వీడియో చివరకు పోలీసుల కంట పడింది. నిబంధనలకు విరుద్ధంగా బీచులో కారు నడిపినందుకు, టూరిస్టుల ప్రాణాలకు హాని కలిగే విధంగా ప్రవర్తించినందుకు లలిత్ కుమార్‌పై పోలీస్ అధికారులు సీరియస్ అయ్యారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితుడ్ని అరెస్ట్ చేయటంతో పాటు కారును కూడా సీజ్ చేశారు. కారు అసలు ఓనర్‌పై కూడా కేసు నమోదు చేశారు. మరి, ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
#Beach|| This is what a insensitive Delhi based tourist did at Anjuna beach. pic.twitter.com/3epg6vdaPS
— Goa News Hub (@goanewshub) June 16, 2022
ఇవి కూడా చదవండి : Antahpuram: ప్రేమించి మరీ పెళ్లి చేసుకున్నాడు.. చివరికి భార్య అందంగా లేదని!