మేడ్చల్ జిల్లాలో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. తల్లి మృతదేహం పక్కనే కుమారుడు మూడు రోజులుగా గడిపిన ఘటన తాజాగా తీవ్ర కలకలంగా మారుతోంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అది మేడ్చల్ జిల్లాలోని విష్ణుపురి కాలనీ. ఓ తల్లితో పాటు 22 ఏళ్ల కుమారుడు సాయికృష్ణ ఓ అపార్ట్ మెంటులో నివాసం ఉంటున్నారు. అయితే ఈ కుమారుడు తల్లితో ప్రతీ రోజు గొడవ పడుతుండేవాడని స్థానికులు చెబుతున్నారు.
ఇదిలా ఉంటే తాజాగా వారు నివాసం ఉంటున్న అపార్ట్ మెంట్ ప్లాట్ లోని 202 నెంబర్ గల రూమ్ నుంచి విపరీతమైన దర్వాసన వస్తుంది. దీనిని గమనించిన స్థానికులు ఏంటా అని ఆరా తీశారు. ఎంతకూ అంతుచిక్కకపోవడంతో అనుమానమొచ్చిన స్థానికులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు తలుపులు తీసి చూసేసరికి షాకింగ్ సీన్ వారి కళ్ల ముందు తేలియాడింది.
ఇది కూడా చదవండి: Bhadradri: మద్యం కోసం గొడవ.. పెళ్లి వేడుకలో రక్తపాతం.. ఎస్సైని కూడా వదల్లేదు..కుళ్లిపోయిన స్థితిలో ఓ మహిళ శవం ఉంది. ఆ శవం పక్కనే కుమారుడు కూడా ఉండడం చూసి ఒక్కసారిగా అందరూ ఖంగుతిన్నారు. ఇక పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. అనంతరం కొడుకు సాయికృష్ణ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మానసిక స్థితి బాగా లేదని, తరచూ తల్లీ కొడుకులు గొడవ పడుతుండే వారని స్థానికులు చెప్పారు. మానసిక స్థితి బాగా లేని కారణంగానే కొడుకే తల్లిని చంపి ఉండొచ్చన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి.
ఈ ఘటనపై పోలీసులు అన్ని కోణాల్లో విచారిస్తున్నారు. కొడుకు కావాలనే చంపాడా? లేక మహిళే ఆత్మహత్య చేసుకుందా?, ఇవివే కాకుండా ఏదైన అనారోగ్య కారణాలు మరింణించిందా అనే ప్రశ్నలకు సమాధానాలు రావాల్సింది. ఇక తల్లి మరణం వెనకు ఏం జరిగిందనే విషయం తెలియాలంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చేంత వరకూ ఆగాల్సిందే. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.