సాధారణంగా అందంగా కనిపించడం కోసం ఆడవాళ్లు ముఖానికి మేకప్ వేసుకుంటారు. ఇక గ్లామర్ ఫీల్డ్‌లో ఉండే వాళ్లకు మేకప్ తప్పనిసరి. ఇక మగువల మేకప్ మీద బోలేడన్ని జోకులు, మీమ్స్. మేకప్ లేకపోతే కొందరు హీరోయిన్లను అసలు గుర్తు పట్టలేం. మేకప్ చేసే మాయ అలా ఉంటుంది. మీ వయసును ఓ పాతికేళ్లు తగ్గించాలన్న.. పెంచాలన్న మేకప్‌తో సాధ్యం. సినిమాల్లో అవసరం మేరకు ఈ ట్రిక్ వాడతారు. కానీ బయట కూడా కొందరు ఇలానే మోసం చేస్తారు. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి తమిళనాడులో చోటు చేసుకుంది. మేకప్ మాయకి ఓ వ్యక్తి చిత్తయ్యాడు. తర్వాత అసలు విషయం తెలిసి కళ్లు తెలేశాడు. 54 ఏళ్ల బామ్మ మేకప్ మహిమతో 34 ఏళ్ల యువతిగా మారింది. ఇంకేముంది ఆమె అందం చూసి మనసు పారేసుకున్న యువకుడు వెంటనే తాళి కట్టేశాడు. తర్వాత ఆమె అసలు రంగు, వయసు తెలియడంతో లబోదిబోమంటున్నాడు. ఆ వివరాలు..
తమిళనాడు తిరువళ్లురు జిల్లా పుదుప్పేట 65 ఏళ్ల ఇంద్రాణి అనే మహిళ కుమారుడి హరితో కలిసి నివాసం ఉంటుంది. అతడి వయసు 35 ఏళ్లు. ఓ ప్రైవేట్ కంపెనీలో మానేజర్‌గా పని చేస్తున్నాడు. హరికి ఇదివరకే వివాహం అయ్యింది. కానీ భార్యతో విబేధాల కారణంగా కొన్నేళ్ల క్రితం విడాకులు తీసుకున్నాడు. ఈ క్రమంలో ఇంద్రాణి గత ఆరేళ్లుగా కుమారుడికి వివాహం చేయడానికి ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో 2021లో తిరుపతి, పుత్తూరుకు చెందిన శరణ్య అనే మహిళ బ్రోకర్ ద్వారా పరిచయం అయ్యింది. ఇంద్రాణి, ఆమె కుమారుడు హరి పెళ్లి చూపులకు వస్తున్నారని తెలియడంతో.. 54 ఏళ్ల వయసున్న శరణ్య వెంటనే బ్యూటీ పార్లర్‌కెళ్లి.. మేకప్ ద్వారా 34 ఏళ్ల యువతిలా మారి పెళ్లి చూపులకు కూర్చుంది.
ఆమె అందానికి ముచ్చపట్ట పెళ్లికుమారుడు హరి, అతడి కుటుంబ సభ్యులు వెంటనే పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఎదురు కట్నంగా 25 సవర్ల బంగారం పెట్టారు. తిరువళ్లూరులో గ్రాండ్‌గా వివాహం కూడా జరిపించారు. ఆ తర్వాత మొదలైంది అసలు కథ. ఇక పెళ్లైన కొద్ది రోజులకే ఆమె బండారం బయటపడింది. భర్తకు, అత్తకు చుక్కలు చూపించింది శరణ్య. భర్త సంపాదనంతా తనకే ఇవ్వాలని.. బీరువా తాళాలు కూడా ఇవ్వాలని గొడవ చేయడం ప్రారంభించింది. ఆస్తులన్ని తన పేరు మీద రాయాలని డిమాండ్ చేసింది. అత్త ఇంద్రాణిని కూడా ఇంటి నుంచి గెంటేసింది. ఆమె వెధింపులకు చెక్ పెట్టాలని భావించిన భర్త.. ఆమె ఆధార్ కార్డు ఇవ్వాలని అడిగాడు. దాంతో శరణ్య గుట్టురట్టయ్యింది
ఆధార్‌కార్డులో శరణ్య కెరాఫ్ రవి అని రాసి ఉండటంతో.. ఇంద్రాణికి, ఆమె కుమారుడికి అనుమానం వచ్చింది. పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు దర్యాప్తు చేయగా కళ్లు బైర్లు కమ్మె నిజాలు వెలుగు చూశాయి. పుత్తూరుకు చెందిన శరణ్య ఇప్పటికే ముగ్గురిని మోసం చేసినట్లు తేలింది. శరణ్య అలియాస్ సుకన్యకి పుత్తూరుకి చెందిన రవితో వివాహం కావడమే కాక ఇద్దరు కుమార్తెలు కూడా ఉన్నారు. వారికి వివాహం కూడా అయ్యింది. అయితే కొద్ది కాలం క్రితం భర్త నుంచి విడిపోయిన సుకన్య.. తల్లి దగ్గర ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో రెండో వివాహం చేసుకోవాలని భావించింది. ఈ క్రమంలో పెళ్లిల్ల బ్రోకర్లను కలిసి.. విడాకులు తీసుకున్న వారిని టార్గెట్ చేసేది.
ఇలా గతంలో సంధ్య పేరుతో సుబ్రహ్మణ్యన్ అనే అతడిని రెండో వివాహం చేసుకుని.. 11 సంవత్సరాలు కాపురం చేసింది. కరోనా కాలంలో తల్లిని చూసి వస్తానని వచ్చింది శరణ్య. ఈ క్రమంలో ఇంద్రాణి సంబంధం గురించి తెలిసి వారికి వలేసింది. అంతేకాక మొదటి భర్త రవిపై కేసు పెట్టి 10 లక్షలు వసూలు చేసింది. చివరకు ఇంద్రాణి కుమారుడు ఫిర్యాదుతో.. ఈ అవ్వ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. మరి ఈ ఘరానా మోసంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.