శిల్పా చౌదరి చేతిలో మోసపోయిన వారి జాబితాలో సూపర్‌స్టార్ మహేష్ బాబు చెల్లి, హీరో సుధీర్‌బాబు భార్య ప్రియ కూడా చేరారు. తన నుంచి దాదాపు రూ.2.93 కోట్లు తీసుకుని మోసం చేసినట్లు ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. బుధవారం నార్సింగ్ పోలీసులకు ఆమె శిల్పా చౌదరిపై ఫిర్యాదు చేశారు. కాగా కిట్టిపార్టీల నిర్వహణ పేరుతో చాలా మంది ప్రముఖుల నుంచి కోట్ల రూపాయలు వసూలు చేసి మోసాని పాల్పడ్డ ఆమెపై ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే చాలామంది ఆమెపై ఫిర్యాదులు చేస్తున్నారు. ఇంకా మరికొంత కూడా ఆమె చేతిలో మోసపోయినట్లు సమాచారం. వాళ్లు కూడా త్వరలో బయటికొచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది.