ఆమెకు పెళ్లై ఓ కుమారుడు ఉన్నాడు. భర్తతో ఉన్న గొడవల కారణంగా అతడికి దూరం జరిగి మరో వ్యక్తికి దగ్గరైంది. ఆ తర్వాత అతనితో వివాహేతర సంబంధాన్ని కొనసాగించి చివరికి పెళ్లి చేసుకోవాలని కోరింది. దీనికి సరేనన్న ఆమె ప్రియుడు నమ్మించి నల్లమల అడవుల్లోకి తీసుకెళ్లాడు. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
ఫొటోలో కనిపిస్తున్న మహిళ పేరు లక్ష్మి. వయసు 35 ఏళ్లు. గతంలో ఈమెకు ఓ వ్యక్తితో వివాహం జరిగింది. పెళ్లైన కొంత కొంత కాలం పాటు భర్తతో సంసారం బాగానే చేసింది. అయితే రాను రాను భార్యాభర్తల మధ్య మనస్పర్థలు వచ్చాయి. దీంతో ఒకరిపై ఒకరు మాటల దాడికి చేసుకుని విడిపోయారు. అప్పటి నుంచి లక్ష్మి తన పుట్టింటికి వెళ్లి అక్కడే ఉండేది. ఈ క్రమంలోనే ఆమెకు పెళ్లైన వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయమే చివరికి వివాహేతర సంబంధంగా మారింది. ఇటీవల లక్ష్మి ప్రియుడిని పెళ్లి చేసుకోవాలని కోరింది. దీనికి సరేనన్న ఆమె ప్రియుడు శ్రీశైలం వెళ్దామని నల్లమల అడవుల్లోకి తీసుకెళ్లాడు. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
పోలీసుల కథనం ప్రకారం.. తిమ్మాజిపేట మండలం గొరిట గ్రామానికి చెందిన లక్ష్మికి (35) దేవరకద్ర మండలంలోని డోకూరు గ్రామానికి చెందిన వ్యక్తితో లక్ష్మికి చాలా ఏళ్ల కిందట వివాహం జరిగింది. పెళ్లైన కొంత కాలానికి వీరికి ఓ కుమారుడు జన్మించాడు. అయితే రాను రాను దంపతుల మధ్య సఖ్యత లేకపోవడంతో ఇద్దరూ విడిపోయారు. దీంతో లక్ష్మి అప్పటి నుంచి పుట్టింటికి వెళ్లి తల్లిదండ్రుల వద్దే ఉంటుంది. ఈ క్రమంలోనే లక్ష్మికి అదే గ్రామానికి చెందిన చెన్నయ్య అనే వ్యక్తితో పరిచయం పెరిగింది. ఆ పరిచయమే రాను రాను ఇద్దరి మధ్య వివాహేతర సంబంధంగా మారింది. ఈ విషయం బయటపడడంతో గ్రామ పెద్దలు పంచాయితీ పెట్టించి ఇక నుంచి ఇద్దరు కలుసుకోకూడదని లక్ష్మికి లక్ష రూపాయల పరిహారం ఇప్పించి సర్దిచెప్పారు.
అయినా వినని చెన్నయ్య లక్ష్మికి మళ్లీ దగ్గరయ్యాడు. ఈ క్రమంలోనే చెన్నయ్య భార్యతో పాటు అతని ప్రియురాలు ఇద్దరూ గర్భం దాల్చారు. లక్ష్మి ఏడు నెలల గర్భిణితో ఉండగా ప్రియుడిని పెళ్లి చేసుకోవాలని పదే పదే కోరేది. అంతేకాకుండా నా పేరు రెండెకరాల పొలం కూడా రాయించాలని ప్రియుడికి చెప్పేది. దీంతో విసుగిపోయిన చెన్నయ్య.. శ్రీశైలం పెళ్లి చేసుకుందామని లక్ష్మికి మాటిచ్చాడు. దీంతో ఇద్దరూ కలిసి మార్చి 1న బైక్ పై శ్రీశైలం వెళ్లాలని నిర్ణయించారు. అనుకున్నట్టుగానే ఇద్దరూ నల్లమల అడవుల వరకు వెళ్లారు.
ఇక మధ్యలోకి వెళ్లాక చెన్నయ్య ప్రియురాలు లక్ష్మిని అడవి లోపలికి తీసుకెళ్లి కర్రతో కొట్టి చంపాడు. ఆ తర్వాత పెట్రోల్ తో ఆమె శవాన్ని కాల్చి అక్కడి నుంచి పరారయ్యాడు. అయితే మార్చి 1 నుంచి లక్ష్మి కనిపించకపోవడంతో ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు చెన్నయ్యపై అనుమానంతో అతడిని విచారించగా అసలు నిజాలు బయటపెట్టాడు. అవును.. నేను లక్ష్మిని నల్లమల అడవుల్లోకి తీసుకెళ్లి హత్య చేశానని నేరాన్ని అంగీకరించాడు. అనంతర ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది.