మహబూబ్ నగర్ జిల్లాలో 8 ఏళ్ల క్రితం ఓ భార్యాభర్తలు ఉన్నట్టుండి కనిపించకుండా పోయారు. వారి కుటుంబ సభ్యులు ఎంత వెతికినా ఆ దంపతుల జాడ మాత్రం దొరకలేదు. చేసేదేం లేక కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మిస్సింగ్ కేసు నమోదు చేసి గాలించారు. అయిన ఎలాంటి సమాచారం దొరకలేదు. కట్ చేస్తే 8 ఏళ్ల తర్వాత ఆ దంపతులు మిస్సింగ్ కాదని, హత్య చేసి పాతిపెట్టారనే సంచనల నిజాలు వెలుగులోకి వచ్చాయి. చాలా ఏళ్ల తర్వాత వెలుగులోకి వచ్చిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అది మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలం పేరూర్. ఇదే గ్రామానికి చెందిన బోయ ఆంజనేయలు (37) బోయ శాంతమ్మ భార్యాభర్తలు(32). వీరికి చాలా ఏళ్ల కిందటే వివాహం జరిగింది. అయితే పేరూర్ కు చెందిన నానేష్, మహ్మద్ రఫీతో పాటు మండలంలోని ఇస్రంపల్లికి చెందిన బుర్రన్ అనే వ్యక్తి బొగ్గు అమ్మేవాడు. అలా బొగ్గు అమ్ముతున్న క్రమంలోనే బోయ ఆంజనేయులు బుర్రన్ కు పరిచయం అయ్యాడు. ఈ పరిచయంతోనే ఆంజనేయులు బుర్రన్ వద్ద గతంలో రూ.20 వేలు అప్పుగా తీసుకున్నాడు. కొన్ని రోజుల తర్వాత ఇచ్చిన అప్పు తిరిగి ఇవ్వాలని బుర్రన్ ఆంజనేయులు ఇంటికి వచ్చేవాడు. అలా వస్తున్న క్రమంలోనే ఆంజనేయులు భార్య శాంతమ్మ బుర్రన్ కు పరిచయం అయింది. వీరి పరిచయం రారు రాను వివాహేతర సంబంధానికి దారి తీసింది.
దీంతో బుర్రన్ ఆంజనేయులుకు తెలియకుండా ఆయన భార్యతో ఎంచక్కా వివాహేతర సంబంధాన్ని కొనసాగించాడు. కొంతకాలానికి బుర్రన్ నా భార్యతో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడని ఆంజనేయులు తెలుసుకుని కోపంతో ఊగిపోయాడు. ఇక నుంచి నా భార్య వద్దకు వస్తే చంపేస్తానంటూ వార్నింగ్ ఇచ్చాడు. కోపంతో ఊగిపోయిన బుర్రన్.., ఇచ్చిన అప్పు తిరిగి ఇవ్వకపోవడం, పైగా వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉండడంతో ఆంజనేయులును చంపాలని పథకం రచించాడు. ప్లాన్ లో భాగంగానే 2014 ఏప్రిల్ 19న మాట్లాడుకుందామని బుర్రన్ ఆంజేయులును ఓ చోటకు పిలిచాడు. అతను వస్తున్నాడని తెలియడంతో బుర్రన్.. నానేష్, మహ్మద్ రఫీని వెంటపెట్టుకుని అక్కడికి చేరుకున్నారు. అనంతరం ఆంజనేయులు రాగానే అతనితో గొడవకు దిగి గొంతు నులిమి హత్య చేశారు. ఆ తర్వాత నీ భర్తను చంపానని ప్రియుడు బుర్రన్ శాంతమ్మకు చెప్పాడు. దీంతో ఖంగుతిన్న ప్రియురాలు నీ దారుణాన్ని బయటపెడతానని బుర్రన్ పై కోపంతో ఊగిపోయింది.
నిజంగానే శాంతమ్మ బయటపెడుతుందేమోనని భయపడి బుర్రన్ శాంతమ్మను కూడా హత్య చేసి భార్యాభర్తల శవాలను కనిపించకుండా గ్రామ శివారులోని పూడ్చిపెట్టారు. ఈ ఘటనపై కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకుని గాలింపు చర్యలు చేపట్టారు. అయినా వారి జాడ మాత్రం తెలయలేదు. ఇక 8 ఏళ్ల తర్వాత వారి గ్రామంలోని అధికారులు స్మశానవాటిక కోసం గుంతలు తవ్వుతుండగా ఓ చీర, ఎముకలు బయటపడ్డాయి. దీంతో ఖంగుతిన్న అధికారులు పోలీసులకు సమాచారం అందించారు.
అనుమానమొచ్చిన పోలీసులు గత 8 ఏళ్ల క్రితం మిస్సింగ్ కేసులను తిరిగేయగా శాంతమ్మ, ఆంజనేయులు ఆచూకి ఇంతకు దొరకలేదని తెలుసుకున్నారు. దీంతో వెంటనే శాంతమ్మ కుమారుడికి డీఎన్ఏ టెస్ట్ చేశారు. దొరికిన ఎములతో డీఎన్ఏ టెస్ట్ దగ్గరగా ఉండడంతో చనిపోయింది శాంతమ్మ, ఆంజనేయులు దంపతులే అని పోలీసులు నిర్ధారించారు. ఈ ఘటనపై పోలీసులు విచారించే క్రమంలోనే నిందితులు గ్రామ సర్పంచ్ ఎదుట చేసిన తప్పును ఒప్పుకున్నారు. అనంతరం పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఇక నిందితుల్లో ఒకరు మరణించగా మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. ఈ దారుణ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.