ఈ మద్య దేశంలో రోడ్డు ప్రమాదాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. డ్రైవర్ల నిర్లక్ష్యంతో నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఎన్నో కుటుంబాలు అనాథలుగా మిగిలిపోతున్నారు.. అంగవైకల్యంతో బాధపడుతున్నారు. తల్లిదండ్రులకు అండగా ఉంటారనుకున్న పిల్లలు అకస్మాత్తుగా రోడ్డు ప్రమాదంలో మరణించడంతో ఆ కుటుంబాలు శోక సంద్రంలో మునిగిపోయాయి. ఇద్దరు స్నేహితులు తమ జీవితాల్లో అంతా మంచి జరగాలని దేవుడికి మొక్కుకుని తిరుగు ప్రయాణమయ్యారు. కాసేపట్లో ఇంటికి చేరుకుంటారనగా ఆ ఇద్దరి ఆశలను మృత్యురూపంలో వచ్చిన లారీ చిదిమేసింది. వివరాల్లోకి వెళితే..
ఇది చదవండి: ప్రభాస్ సినిమాను ఆకాశానికి ఎత్తేస్తూ ఆనంద్ మహీంద్రా ట్వీట్
మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం ఎదుల్లబంధం గ్రామానికి చెందిన రాజం, గంగక్క దంపతులకు ఐదుగురు సంతానం. వీరిలో చిన్నవాడైన దుర్గం ప్రభాకర్ (21) ఇటీవల ఆర్మీ పరీక్ష హాజరై ఫలితాల కోసం ఎదురు చూస్తున్నాడు. తనకు ఉద్యోగం రావాలన్న కోరికతో కాళేశ్వర ముక్తేశ్వర స్వామిని దర్శించుకునేందుకు తన బాల్య మిత్రుడు, ఇదే గ్రామానికి చెందిన పొట్టాల సంజీవ్(22)తో కలిసి శనివారం సాయంత్రం దర్శనం చేసుకొని అక్కడే నిద్ర చేయాలని భావించారు. నిద్ర చేసిన తర్వాత అర్థరాత్రి ఇద్దరు స్నేహితులు బైక్‌పై ఇంటికి బయలుదేరారు.
ఇది చదవండి: ఆ ప్రమాదం నుండి తప్పించుకున్న వెంకటేష్!
గోదావరి వంతెన దాటి మహారాష్ట్రలోని సిర్వొంచాకు వస్తున్న క్రమంలో ఎదురుగా వచ్చిన లారీ వీరిని వేగంగా ఢీకొట్టింది. దీంతో ప్రభాకర్, సంజీవ్ అక్కికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పొట్టాల సంజీవ్ కి కొద్దినెలల క్రితం మౌనిక అనే యువతితో వివాహం జరిపించగా.. ఆమె ప్రస్తుతం నాలుగు నెలల గర్భవతి. ఈ ప్రమాదంతో రెండు కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై మహారాష్ట్ర పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.