ఇటీవల కాలంలో కుక్కలు దాడి చేసి పిల్లలను హతమార్చిన ఘటనలను ఎన్నో చూశాం. ఆ మద్య ఒక బాలుడిపై సుమారు 12 కుక్కలు దాడి చేస్తుండగా తన కొడుకును కాపాడే ప్రయత్నంలో అడ్డుగా వెళ్లిన తల్లి పై కూడా దాడి చేసి తీవ్రంగా గాయపరచగా.. స్థానికులు తల్లీ కొడుకును ఆసపత్రికి తరలించారు. ఇలా ఎక్కడో అక్కడ చిన్నా, పెద్దలపై కుక్కలు దాడులకు పాల్పపడుతూనే ఉన్నాయి. మహరాష్ట్రలో ఓ చిన్నారిపై కుక్కలు దాడి చేసి చంపేశాయి. వివరాల్లోకి వెళితే..
మహారాష్ట్ర సతారాలోని జగ్‌తప్ వస్తీలో తల్లి ఇంటి దగ్గర్లలోని పొలంలో పని చేస్తుండగా.. మూడేళ్ల వయసు ఉన్న రాజ్‌వీర్ రాహుల్ హౌవల్ కోద్ది దూరంగా ఆడుకుంటున్నాడు. తన కుమారుడు ఆడుకుంటున్నాడని తల్లి తన పని తాను చేసుకుంటూ ఉంది. అంతలోనే యమ కింకరుల్లా పదిహేను కుక్కలు బాలుడిపై దాడి చేశాయి. దారుణంగా కొరికి అవయవాలు ఛిద్రం చేశాయి. తన కొడుకు కనిపించకుండా పోవడంతో తల్లి, స్థానికులు ఊరంతా వెతికారు. చివరికి ఇంటికి సమీపంలోని పొలంలో రాజ్‌వీర్ మృతదేహం కనిపించింది.
రక్తపు మడుగులో పడిఉన్న దృశ్యాన్ని చూసిన ఆ తల్లి తల్లడిల్లిపోయింది. అప్పటి వరకు తన కంటిముందే ఆడుకున్న తన ముద్దుల కొడుకు కి జరిగిన ఘోరాన్ని చూసి బోరున విలపించింది. ఈ సంఘటన చూసి స్థానికులు సైతం చలించిపోయారు. తమ గ్రామంలో వీధి కుక్కలు ఎక్కువ అయ్యాయని.. ప్రభుత్వ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.