రోడ్డుపై నచ్చిన ఆడది కనబడితే చాలు, కొందరు దుర్మార్గులు రంకెలేస్తూ కాలు దువ్వుతున్నారు. ప్రేమిస్తున్నామని వెంటపడడం, కాదంటే అత్యాచారాలు, లేదంటే యాసిడ్ దాడులు. ఇవే నేటి కాలంలో జరుగుతున్న దారుణాలు. ఇదిలా ఉంటే.. అమ్మాయిలకు ఇంట్లోనే రక్షణ లేని ఈ సమాజంలో బయట ఏం రక్షణ ఉంటుందని ఈ ఘటన చూస్తే స్పష్టంగా అర్థమవుతోంది. ఓ తండ్రి దుర్మార్గుడిలా మారి వయసుకు వచ్చిన కన్న కూతురికి నరకం అంటే ఏంటో దగ్గరుండి చూపించాడు. గత మూడేళ్లుగా బయపెట్టి కూతురిపై అత్యాచారానికి ఒడిగట్టాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది.
వివరాల్లోకి వెళ్తే.. మహారాష్ట్ర వార్ధా జిల్లా అల్లీపూర్ పరిధిలోని ఓ గ్రామంలో ఓ భార్యాభర్తలు నివాసం ఉంటున్నారు. వీరికి ఇంటర్ చదివి 17 ఏళ్ల కూతురు కూడా ఉంది. అయితే తండ్రి స్థానికంగా పని చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. ఇదిలా ఉంటే ఈ కిరాతక తండ్రి కన్న కూతురిపై ఎప్పటి నుంచో కన్నేశాడు. ఇంతటితో ఆగకుండా కూతురిని బయపెట్టి గత మూడేళ్ల నుంచి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇదే విషయాన్ని తల్లికి చెప్పే ప్రయత్నం చేసినా.. భార్యను సైతం కొడుతూ తీవ్ర హింసకు గురి చేసేవాడు. అలా ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా మూడేళ్ల పాటు ఆ దుర్మార్గుడు కూతురిపై అత్యాచారం చేస్తూనే ఉన్నాడు. అయితే ఇటీవల కాలేజీకి వెళ్లిన ఆ బాలిక కాస్త నిరసంగా కనిపించడంతో టీచర్ గమనించింది.
వెంటనే ఏం జరిగిందని ప్రశ్నించగా.. ఆ బాలిక తండ్రి చేసిన దారుణాన్ని పూర్తిగా వివరించింది. కోపంతో ఊగిపోయిన ఆ టీచర్ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై వెంటనే స్పందించిన పోలీసులు బాలికను ఆస్పత్రికి తరలించి ఆ బాలిక తండ్రిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అనంతరం నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు జైళ్లో చిప్పకూడు చేతికిచ్చారు. కన్నకూతురిపై తండ్రి ఇంతటి దారుణాన్ని జీర్ణించుకోలేని స్థానికులు ఈ దుర్మార్గుడిని కఠినంగా శిక్షించాంటూ డిమాండ్ చేస్తున్నారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకంగా మారింది. కన్న కూతురిపై ఎవరూ ఊహించని దారుణానికి పాల్పడ్డ ఈ కిరాతక తండ్రికి ఎలాంటి శిక్ష విధించాలి? మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.