నేటి కాలంలో కొందరు మోసగాళ్లు ఎదుటివారి బలహీనతను ఆసరాగా చేసుకుని అనేక మోసాలకు పాల్పడుతున్నారు. మరీ ముఖ్యంగా సోషల్ మీడియా యుగం కొత్త పుంతలు తొక్కడంతో లాభాలతో పాటు నష్టాలు కూడా దానికి తగ్గట్టే ఉంటున్నాయి. ఇదిలా ఉంటే ఓ 54 ఏళ్ల వృద్దుడు ఓ యువతి అందాన్ని చూసి మోసపోయాడు. కక్కుర్తిపడి ఏదో చేయాలనుకుంటే చివరికి ఏదో జరిగింది. అసలు విషయం బయటపడంతో ఖంగుతిన్న ఆ వృద్దుడు నెత్తి, నోరు బాదుకున్నాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. విషయం ఏంటంటే?
మహారాష్ట్ర ముంబైలోని ఓ ప్రాంతంలో 54 ఏళ్ల వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఇతని భార్య గతంలో మరణించడంతో అతని కుమారుల వద్దే నివాసం ఉంటున్నాడు. అయితే చింత చచ్చిన పులుపు చావదన్నట్లుగా ఆ వృద్దుడు ఓ యువతి అందం చూసి మోసపోయాడు. ఇటీవల ఆ వృద్దుడుకి ఫేస్ బుక్ నుంచి ఓ అందమైన యువతి నుంచి ఫ్రెండ్ రిక్విస్ట్ వచ్చింది. దీంతో ఆలస్యంగా చేయని ఆ వృద్దుడు ఆనందంతో చంకలు గుద్దుకుని ఆ రిక్వస్ట్ ను ఆక్సెప్ట్ చేశాడు. అలా కొంత కాలం పాటు వీళ్లిద్దరూ ఛాటింగ్ లు కూడా చేసుకున్నారు. ఇక కొన్ని రోజులు గడిచాక ఫోన్ నెంబర్లు కూడా ఇచ్చుపుచ్చకుని మాట్లాడుకున్నారు.
అయితే ఇటీవల ఆ యువతి న్యూడ్ గా మాట్లాడుకుందామని కాస్త మత్తెక్కించే మాటాలతో ముసలాయనన కాస్త లైన్ లోకి తెచ్చుకుంది. దీంతో సంభరపడ్డ ఆ వృద్దుడు కాదనకుండా సరే నంటూ ఓ రోజు రాత్రి బాత్రూంలో ఆ యువతితో న్యూడ్ గా వీడియో కాల్ మాట్లాడాడు. కానీ ఆ యువతి తెలివిగా అతనితో న్యూడ్ గా వీడియో కాల్ మాట్లాడే సమయంలో స్రీన్ రికార్డ్ చేసుకుంది. అనంతరం ఓ రోజు గడిచాక ఆ యువతి వృద్దుడికి ఫోన్ చేసి.. అడిగినంత డబ్బులు ఇవ్వాలని, లేకుంటే నీ న్యూడ్ వీడియో సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తానని బ్లాక్ మెయిలింగ్ కు దిగింది. దీంతో తల పట్టుకున్న ఆ వృద్దుడు ముందుగా ఫోన్ పే ద్వారా రూ.30 వేలను పంపాడు. మరో రోజు గడిచాక మరింత డబ్బు కావాలంది. దీనిని భరించలేకపోయిన ఆ ముసలాయన ఆమె నుంచి వచ్చే ఫోన్ కాల్ ను లిఫ్ట్ చేయడమే మానేశాడు.
ఇదిలా ఉంటే మరుసటి రోజు కొత్త నెంబర్ నుంచి కొందరు వ్యక్తులు ఫోన్ చేసి మేము సీబీఐ ఆఫీసు నుంచి మాట్లాడుతున్నామని, ఓ యువతితో నువ్వు న్యూడ్ వీడియో కాల్ మాట్లాడినట్లుగా ఫిర్యాదు వచ్చిందన్నారు. దీనిని నుంచి తప్పించుకోవాలంటే ముందుగా రూ.5 లక్షలు ఇవ్వాల్సిందేనంటూ పట్టుబట్టారు. జడుసుకున్న ఆ పెద్దమనిషి ఏం చేయాలో తెలియక నెత్తి, నోరు బాదుకున్నాడు. అనంతరం ఇక చేసేదేం లేక తన కుమారులకు జరిగిన విషయాన్ని చెప్పాడు. షాక్ కు గురైన అతని కుమారులు ముంబై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. 54 ఏళ్ల వృద్దుడిని తన అందంతో బురిడీ కొట్టించిన యువతి దారుంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.