ఆమెకు పెళ్లై ఓ కుమారుడు ఉన్నాడు. కొంత కాలం తర్వాత ఓ వ్యక్తితో వివాహేతర సంబంధాన్ని నడిపించింది. చివరికి పెళ్లి కూడా చేసుకోవాలని అనుకుంది. కానీ, కుమారుడు అడ్డుగా ఉండడంతో దారుణానికి పాల్పడింది.
ఈ రోజుల్లో కొందరు పెళ్లైన మహిళలు భర్తను కాదని పరాయి మగాడితో అన్నీ చేస్తున్నారు. దానికి ప్రేమ అని పేరు పెట్టి తాళికట్టిన మొగుడికి నమ్మక ద్రోహం చేస్తున్నారు. అంతేకాకుండా భర్త కళ్లు గప్పి ప్రియుడితో సినిమాలు, షికారులు ఒకటేంటి.. పిచ్చ పిచ్చగా రొమాన్స్ చేస్తూ మొగుడిని పిచ్చోడిని చేస్తున్నారు. ప్రియుడితో గడిపేందుకు చివరికి అడ్డొచ్చిన భర్తను, పిల్లలను కూడా లెక్క చేయకుండా కాటికి పంపుతున్నారు. ఈ మధ్యకాలంలో ఇలాంటి ఘటనలు చాలానే జరుగుతున్నాయి. అయితే అచ్చం ఇలాగే బరితెగించిన ఓ ఇల్లాలు.. ప్రియుడిపై మోజుతో దారుణానికి పాల్పడింది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. అసలేం జరిగిందంటే?
పోలీసుల కథనం ప్రకారం.. మహారాష్ట్ర సాంగ్లీ జిల్లా ఖానాపూర్ పరిధిలోని లేంగ్రీ గ్రామం. ఇక్కడే జ్యోతి లోంధే అనే వివాహిత నివాసం ఉంటుంది. ఆమెకు శౌర్య అనే 6 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. అయితే కొన్నాళ్ల తర్వాత జ్యోతి తన బుద్దిని వక్రమార్గంలోకి నెట్టేసింది. కట్టుకున్న మొగుడిని కాదని పరాయి మగాడితో ప్రేమలో మునిగిపోయింది. ఇక భర్త కళ్లు గప్పి జ్యోతి ప్రియుడితో ఎంజాయ్ చేసింది. తన చీకటి కాపురాన్ని భర్తకు తెలియకుండా కొన్నాళ్ల పాటు మెయింటెన్ చేస్తూ వచ్చింది. చివరికి ప్రియుడినే పెళ్లి చేసుకోవాలని అనుకుంది. కానీ, కుమారుడు అడ్డుగా ఉన్నాడు. ఆమెకు ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పుడే ఆ మహిళకు ఓ ఆలోచన వచ్చింది. కొడుకు కన్నా ప్రియుడు ముఖ్యం అనుకుని కుమారుడిని హత్య చేయాలనుకుంది.
ఇదే విషయాన్ని తన ప్రియుడికి వివరించింది. దీనికి అతడు కూడా అంగీకరించారు. ఇక ఇద్దరు కలిసి ఇటీవల ఆ చిన్నారిని బైక్ మీద తీసుకెళ్లి స్థానికంగా ఉండే ఓ బావిలో పడేసి దారుణంగా హత్య చేశారు. కొన్ని రోజుల తర్వాత బావిలో ఆ చిన్నారి మృతదేహం తేలింది. దీనిని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ బాలుడి మృతదేహాన్ని బయటకు తీశారు. అనంతరం పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టగా అసలు నిజాలు బయటపడ్డాయి. ప్రియుడితో చేతులు కలిపి కుమారుడిని హత్య చేసినట్లు ఆమె అంగీకరించిందని పోలీసులు తెలిపారు. దీంతో జ్యోతి లోంధేతో పాటు ఆమె ప్రియుడిని అరెస్ట్ చేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. ప్రియుడి కోసం కన్న కొడుకుని చంపిన కిరాతక తల్లి దారుణంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.