ఓ తండ్రి దారుణానికి పాల్పడ్డాడు. కన్న కొడుకుని అతి కిరాతకంగా కొట్టి చంపాడు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. తండ్రి ఎందుకు కుమారుడిని హత్య చేశాడంటే?
మహారాష్ట్రలో దారుణం చోటు చేసుకుంది. ఓ తండ్రి కన్న కొడుకుని అతి కిరాతకంగా హత్య చేశాడు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. అయితే ఈ ఘటనపై కొందరు స్పందిస్తూ.. తండ్రి సరైనా పని చేశాడంటూ అతనికి సపోర్ట్ చేస్తుంటే.. ఇంత దానికి హత్య చేస్తాడా అంటూ మరి కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తండ్రి కుమారుడిని ఎందుకు హత్య చేశాడు? అతడు చేసిన తప్పేంటి? అసలేం జరిగిందంటే?
పోలీసుల కథనం ప్రకారం.. మహారాష్ట్ర జల్నా జిల్లా అంబాద్ పరిధిలోని ఓ ప్రాంతంలో ఓ వ్యక్తి నివాసం ఉంటుంది. ఇతనికి ఓ కుమారుడు ఉన్నాడు. అయితే ఇతడు గత కొన్ని రోజుల నుంచి మద్యం, గంజాయికి అలవాటు పడి చెడు తిరుగుళ్లు తిరుగుతున్నాడు. మద్యం తాగొద్దని తండ్రి ఎన్నోసార్లు నచ్చ జెప్పాడు. ఇవేం పట్టించుకోని ఆ యువకుడు.. అదే పనిగా మద్యం సేవిస్తూ ఉండేవాడు. ఇక ఇదే విషయంపై తండ్రి కొడుకుతో ఈ నెల 15 గొడవకు దిగాడు. దీంతో ఒకరిపై ఒకరు మాటల దాడి చేసుకున్నారు. మంగళవారం కూడా తండ్రీకొడులు ఇదే విషయంపై మరోసారి గొడవ పడ్డారు. క్షణికావేశంలో ఊగిపోయిన తండ్రి కుమారుడిని దారుణంగా కొట్టి చంపాడు.
దీనిని గమనించిన స్థానికులు వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని నిందితుడిని అరెస్ట్ చేశారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. ఈ ఘటనపై కొందరు స్పందిస్తూ.. తండ్రి నిర్ణయాన్ని సపోర్ట్ చేస్తుంటే.., మరి కొందరు నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. మత్తుకు బానిసయ్యాడని కొడుకుని చంపిన తండ్రి దారుణంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.