మహారాష్ట్రలో ఘోరం చోటు చేసుకుంది. ఒకే ఇంట్లో 9 మంది అనుమానాస్పదంగా మరణించడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ ఘటనను సవాల్ గా స్వీకరించిన పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేపడుతున్నారు. మరణించిన వారిలో ఐదుగురు మహిళలు కాగా, మరో నలుగురు పురుషులు అని పోలీసులు గుర్తించారు. అయితే ఈ ఘటన ఎక్కడ జరిగింది? అసలు పోలీసులు ఏం చెబుతున్నారనేది ఇప్పుడు తెలుసుకుందాం.
మహారాష్ట్రలోని సంగ్లీ జిల్లా మైసల్ పట్టణం. ఇదే ప్రాంతంలోని మాణిక్ వాన్‌మోర్ ఇంట్లో సోమవారం ఒకే కుటుంబానికి చెందిన 9 మంది వేర్వేరు రూముల్లో శవాలుగా పడి ఉన్నారు. అయితే ఈ సమాచారాన్ని అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నారు. ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో విచారిస్తున్నారు. వీరంత విషం తాగి ఆత్మహత్య చేసుకుని మరణించినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. వీరంతా ఆత్మహత్య చేసుకున్నారా? లేక ఎవరైన కావాలని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారా? అనేది తెలియాలి. అయితే ఒకే ఇంట్లో 9 మంది మరణించడం అనేది స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.