ప్రతీ ఒక్కరికి ఓ పర్సనల్ లైఫ్ అనేది ఉంటుంది. వారి వ్యక్తిగత జీవితంలో కొన్ని అందిరికీ చెప్పే విషయాలు ఉంటే,.. ఇంకొందరికి చెప్పకూడని విషయాలు దాగి ఉంటాయి. అలా జీవితంలో జరిగిన కొన్ని ఘట్టాలను రాబోయే కాలంలో చదువుకునేందుకు కొందరు డైరీలో రాసుకుంటుంటారు. అలా వాళ్లు రాసుకున్న డైరీలోని కొన్ని విషయాలు ఎవరికీ తెలియకుండా జాగ్రత్తగా భద్రపరుచుకుంటుంటారు. అలా జాగ్రత్తగా తమ డైరీని ఎవరూ చదవకుండా భద్రపరుచుకున్న మన రహస్యాలను ఎవరైన చదివారని తెలిస్తే మన ఫీలింగ్ ఎలా ఉంటుంది. అలా ఓ కోడలు రాసుకున్న తన పర్సనల్ డైరీని అత్తమామలు చదివారు. ఈ విషయం తెలుసుకున్న ఈ కోడలు ఆత్మహత్య చేసుకుంది.
తాజాగా మహారాష్ట్రలో వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. వివరాల్లోకి వెళ్తే.. అది మహారాష్ట్ర నాగ్ పూర్ లోని సావేర్. రత్నాకర్, మంగళ ఇద్దరు భార్యాభర్తలు. భర్త కాలేజీలో ప్రొఫెసర్ గా పని చేస్తుండగా భార్య ఇంటిపాటునే ఉండేది. అయితే ఈ దంపతుల కుమారుడిని పెళ్లాడింది నికిత అనే యువతి. పెళ్లైన అనంతరం భర్త నికితతో సంతోషమైన జీవితాన్ని గుడుపుతున్నాడు. ఈ భార్యాభర్తలిద్దరూ తల్లిదండ్రులకు దూరంగా ఓ చోట కాపురం పెట్టారు.
అయితే ఇటీవల కొడుకుతో పాటు కోడలు కూడా ఇంటికి వచ్చింది. ఇదిలా ఉంటే కోడలు నికితకు డైరీ రాసే అలవాటు ఉండేది. ఆమె రాసే డైరీలో ఏముందనే విషయాలు తెలుసుకునేందుకు అత్తమామలు చాలా ఆసక్తి చూపించేవారు. ఇందులో భాగంగానే ఎలాగైన కోడలి డైరీ చదవాలని భావించి కోడలు లేని టైమ్ చూసి ఆమె రాసుకున్న తన పర్సనల్ డైరీ చదివేశారు. అందులో కోడలు నికిత అత్తను దెయ్యం అంటూ రాసుకుంది. ఇది చదవిని అత్త మంగళకు కోపం వచ్చింది. దీంతో ఇదే విషయంపై అత్త కోడలితో వాద్వాదానికి దిగింది.
ఇదే విషయంపై అత్తమామలు పెద్దలతో పంచాయితీ కూడా పెట్టించారు. పెద్దల పంచాయితిలో అత్త తన పరువు తీసిందని భావించిన కోడలు నికిత మనస్థాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడింది. ఇక నికిత మరణంపై ఆమె బంధువులు అత్తమామలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతన్నారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.