నేటి కాలం యువత వయసుతో సంబంధం లేకుండా ప్రేమా, గీమా అంటూ తెగ తిరిగేస్తున్నారు. ఇంటర్ చదివే రోజుల్లోనే ఆకర్షణకు, ప్రేమకు తేడా తెలియకుండా ప్రేమ పేరుతో జులాయిగా తిరుగుతున్నారు. ఇంతటితో ఆగుతున్నారా అంటే అదీ లేదు. మరీ ముఖ్యంగా అమ్మాయిలు.. ప్రేమించిన వాడిని దక్కించుకోవాలనే ప్రయత్నంలో అడ్డు వచ్చిన తల్లిదండ్రులను సైతం అడ్డు తొలగించుకునేందుకు కూడా వెనకాడడం లేదు. సరిగ్గా ఇలాగే ఇద్దరు టీనేజ్ అమ్మాయిలు ఒకే కుర్రాడి కోసం కొట్టుకున్నారు. బుధవారం మహారాష్ట్రలోని పయ్ థాన్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది.
అసలేం జరిగిందంటే? పయ్ థాన్ జిల్లాకు చెందిన ఓ యువకుడు ఇద్దరు అమ్మాయిలను లైన్ పెట్టాడు. ఒకరికి తెలియకుండా ఒకరిని ప్రేమించి తగు జాగ్రత్తలు తీసుకున్నాడు.. అయితే ఇటీవల ఆ యువకుడు మరో యువతితో కలిసి స్థానిక బస్టాండ్ లో నిలిచున్నాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న మరో యువతి తన ప్రియుడితో ఉండగా బస్టాండ్ లో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. దీంతో కోపంతో ఊగిపోయిన ఆ యువతి నువ్వు ఎవ్వరంటూ ఆ యువతిపై దాడికి దిగింది. అసలు నువ్వు ఎవరంటూ ఇలా జుట్లు పట్టుకుని ఫైటింగ్ కు దిగారు. ప్రియుడు ఏం చేయాలో అర్థం కాక వారికి తెలియకుండా అక్కడ నుంచి మెల్లగా జారుకున్నాడు. ఇక కొద్దిసేపటికి కొందరు స్థానికులు గమనించి గమనించి పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ టీనేజ్ అమ్మాయిలను స్టేషన్ కు తీసుకెళ్లి కౌన్స్ లింగ్ ఇచ్చి వారి తల్లిదండ్రులకు అప్పగించారు.