మాములుగా కొందరు తెలివైన దొంగలు బ్యాంకులకు కన్నం వేస్తూ వేల కోట్ల నగదును దొచుకెళ్తుంటారు. ఇదే కాకుండా డబ్బుతో ఎవరు, ఎక్కడ కనిపించినా వదలకుండా పసిగట్టి మరీ వారి నుంచి డబ్బును కొల్లగొట్టేందుకు కార్లు, బైక్ లతో ఛేజింగ్ చేస్తూ చివరికి సోమ్మును లాక్కెళ్తుంటారు. ఇలాంటి సీన్స్ మనం ఎక్కువగా యాక్షన్ సినిమాల్లో చూస్తూ ఉంటాం. కానీ సరిగ్గా యాక్షన్ సినిమాకు ఏ మాత్రం తీసిపోని దోపిడీ ఘటన తాజాగా పూణెలో చోటు చేసుకుంది. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్రచర్చనీయాంశమవుతోంది.
అసలేం జరిగిందంటే? మహారాష్ట్రలోని ఇందాపూర్ ప్రాంతంలో శుక్రవారం తెల్లవారు జామున 3 గంటల ప్రాంతంలో భవేష్ కుమార్, విజయ్ భాయ్ అనే వ్యక్తులు 3.60 కోట్ల నగదుతో కారులో వెళ్తున్నారు. వీరు భారీ నగదుతో వెళ్తున్నారని కొందరు దొంగలు పసిగట్టారు. ఎలాగైన వారిని వెంబడించి డబ్బును కొల్లగొట్టేందుకు ప్లాన్ వేశారు. ప్లాన్ లో భాగంగానే ఆ దుండగులు డబ్బుతో వెళ్తున్న కారును ఫాలో అవుతు వెళ్తున్నారు. కొద్ది దూరం వెళ్లగానే వారు ప్రయాణిస్తున్న కారును మెల్లగా ఓ చోట ఆపే ప్రయత్నం చేశారు. దీంతో అలెర్ట్ అయిన దొంగలు కారుపై దాడికి పాల్పడ్డారు. ఇక ఏదో జరుగుతుందని గ్రహించిన భవేష్ కుమార్, విజయ్ కారు వేగాన్ని పెంచారు. అయినా వదలని ఆ దొంగలు ఆ కారుపై కాల్పులు జరిపిన దుండగులు బైక్ లతో వారు ప్రయాణిస్తున్న కారును ఛేజింగ్ చేస్తూ ఎట్టకేలకు కారును పట్టుకున్నారు.
అనంతరం అందులో ఉన్న వ్యక్తలను కొట్టి కారులో ఉన్న డబ్బుతో పరారయ్యారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. పోలీసుల విచారణలో ఖంగుతినే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. అసలు ట్విస్ట్ ఏంటంటే? ఆ రూ. 3.60 కోట్ల డబ్బు అక్రమంగా తీసుకొస్తున్నారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరింత విచారణ చేపట్టి ఇంత డబ్బు ఎక్కడిది, ఎక్కడి నుంచి తీసుకెళ్తున్నారనే వాస్తవాలను పోలీసులు వెతికిపట్టే పనిలో ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.