పెళ్లైన ఓ మహిళ భర్తను కాదని మరో మగాడిపై మనసు పడింది. ఇదే విషయం కొంత కాలానికి ఆమె మరిదికి తెలిసింది. బుద్ది మార్చుకోవాలంటూ అనేక సార్లు చెప్పి చూశాడు. అయినా వినని ఆ మహిళ మళ్లీ అదే దారిలో అడుగులు వేసింది. తట్టుకోలేని ఆమె మరిది చివరికి ఎవరూ ఊహించని దారుణానికి పాల్పడ్డాడు. అసలేం జరిగిందంటే?
సమాజంలో రోజు రోజుకు ఊహించని దారుణాలు వెలుగు చూస్తున్నాయి. మరీ ముఖ్యంగా వివాహేతర సంబంధాల కారణంగానే ఈ హత్యలు మరింత ఎక్కువవుతున్నాయి. అచ్చం ఇలాంటి ఘటనలోనే ఓ వ్యక్తి దారుణానికి పాల్పడ్డాడు. తన వదిన పరాయి మగాడితో తిరుగుతుందని తెలుసుకుని ఊహించని కిరాతకానికి పాల్పడ్డాడు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. అసలేం జరిగిందంటే?
పోలీసుల కథనం ప్రకారం.. మహారాష్ట్ర పూణే పరిధిలోని కోంద్వా గ్రామంలో ఆమ్రపాలి అనే మహిళ నివాసం ఉంటుంది. ఆమె గతంలో ఇదే ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తితో వివాహం జరిగింది. పెళ్లైన చాలా కాలం పాటు భర్తతో బాగానే సంసారం చేస్తూ వచ్చింది. అలా కొంత కాలానికి ఈ మహిళకు ఓ కూతురు, కుమార్తె జన్మించింది. కొంత కాలం పాటు వీరి దాంపత్య జీవితం సాఫీగానే సాగుతూ వచ్చింది. ఇదిలా ఉంటే ఈ వివాహిత భర్తను కాదని స్థానికంగా ఉండే కొంతమంది యువకులతో వివాహేతర సంబంధాన్ని కొనసాగించింది. అయితే ఇదే విషయం కొన్నాళ్లకి ఆమె మరిది వైభవ్ వాఘ్మారేకు తెలిసింది.
దీంతో అతడు బద్ది మార్చుకోవాలని అనేకసార్లు వదినకు చెప్పి చూశాడు. కానీ, ఆమ్రపాలి అవేం పట్టించుకోకుండా ఏకంగా మరిది ముందు ప్రియుడితో తిరుగుతూ కనిపించింది. ఇక మరిదికి పట్టరాని కోపం వచ్చింది. ఇలా అయితే కాదని భావించిన వైభవ్.. మా పరువు తీస్తున్న వదినను చంపాలని అనుకున్నాడు. తాను అనుకున్నట్లే వైభవ్ బుధవారం రాత్రి వదినతో మరోసారి గొడవ పడ్డాడు. క్షణికావేశంలో ఊగిపోయిన వైభవ్.. వదినతో పాటు ఆమె ఇద్దరు పిల్లలను దారుణంగా హత్య చేశాడు. ఆ తర్వాత మృతదేహాలపై పెట్రోల్ పోసి నిప్పంటించి అక్కడి నుంచి పరారయ్యాడు.
ఇక మరుసటి రోజు ఈ దారుణాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు గురువారం నిందితుడిని అరెస్ట్ చేశారు. తాజాగా వెలుగు చూసిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. పరువు తీస్తుందని వదిన, ఆమె పిల్లలను దారుణంగా హత్య చేసిన మరిది దారుణంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.