ఓ వ్యక్తి భార్యపై కోపంతో విచక్షణ కోల్పోయి దారుణానికి పాల్పడ్డాడు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. అసలేం జరిగిందంటే?
ఓ వ్యక్తి విచక్షణ కోల్పోయి ప్రవర్తించాడు. కని పెంచిన పిల్లలు అని కూడా చూడకుండా దారుణానికి పాల్పడ్డాడు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. అసలేం జరిగిందంటే? మహారాష్ట్ర ఛత్రపతి శంభాజీ నగర్ పరిధిలోని చికల్తానా ప్రాంతంలో రాజు భోంస్లే అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఇతనికి గతంలో ఓ మహిళతో వివాహం జరిగింది. పెళ్లైన కొంత కాలం పాటు భార్యతో బాగానే సంసారం చేశాడు. అలా కొంత కాలానికి ఈ దంపతులకు ఇద్దరు కుమారులు జన్మించారు. పెద్ద కుమారుడికి 9 ఏళ్ల వయసు ఉండగా, చిన్న కుమారుడికి 7 ఏళ్లు. అయితే గత కొన్ని రోజుల నుంచి రాజు కుటుంబంలో ఒక్కసారిగా మనస్పర్థలు భగ్గుమన్నాయి. దీంతో రోజూ భార్యతో గొడవ పడేవాడు. ఈ క్రమంలోనే శుక్రవారం కూడా భార్యాభర్తలు మరోసారి గొడవ పడ్డారు. దీంతో ఒకరిపై ఒకరు మాటల దాడి చేసుకున్నారు.
భార్యపై కోపాన్ని భర్త పిల్లలపై తీర్చుకున్నాడు. ఇంట్లో ఉన్న తన ఇద్దరు కుమారులను బలవంతంగా తీసుకుని స్థానికంగా ఉన్న ఓ చెరువులో విసిరేశాడు. దీనిని గమనించిన స్థానికులు వెంటనే ఆ నీటిలోకి దిగి మునిగిపోతున్న పిల్లలను రక్షించే ప్రయత్నం చేశారు. కానీ, ఫలితం లేకపోవడంతో పెద్ద కుమారుడిని రక్షించినా.. చిన్న కుమారుడు శ్రేయష్ ప్రాణాలను మాత్రం కాపాడలేకపోయారు. కొడుకు మరణంతో తల్లి గుండెలు పగిలేలా ఏడ్చింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం బాలుడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత ఈ ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. భార్యపై కోపంతో పిల్లలపై తీర్చుకున్న తండ్రి దారుణంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.