Crime News: వివాహేతర సంబంధాలకు అడ్డు అదుపులేకుండా పోతోంది. భర్తను కాదని భార్య, భార్యను కాదని భర్త వేరొకరితో సంబంధం కొనసాగిస్తూ వివాహ బంధానికి మాయని మచ్చగా నిలుస్తున్నారు. కొంతమంది యువతులు ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకునే ధైర్యం లేక వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంటున్నారు. పెళ్లయిన తర్వాత కూడా ప్రియుడితో చనువుగా ఉంటూ ప్రాణాలు పోగొట్టుకోవటమో.. ప్రాణాలు తీయటమో చేస్తున్నారు. కొంతమంది మహిళలు ప్రియుడితో కలిసి పారిపోతున్నారు. తాజాగా, ఓ మహిళ భర్త మరణించిన కొన్ని రోజులకే ప్రియుడితో పరారైంది. ఆరుగురు పిల్లల్ని సైతం వదిలిపెట్టి ప్రియుడితో వెళ్లిపోయింది. ఈ సంఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మహారాష్ట్ర, విదిశా జిల్లాలోని శంషాబాద్ పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన ఓ మహిళ భర్త కొన్ని రోజుల క్రితం వాటర్ ట్యాంక్‌పై నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. భర్త మరణించిన కొన్ని రోజులకే మహిళ ప్రియుడితో పరారైంది. ఆరుగురు పిల్లలను సైతం కాదని ఎదురింట్లో ఉంటున్న ప్రియుడితో వెళ్లిపోయింది. బంధువులు దీనిపై శంషాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. భర్త చనిపోవటం వల్ల మహిళకు రూ.15 లక్షల పరిహారం రాబోతోందని, దాన్ని ఆమె ఖాతాలో కాకుండా పిల్లల పేరు మీద పడేలా చేయాలని కోరారు. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : రామాయం పేటలో తీవ్ర ఉద్రిక్తత.. మున్సిపల్ ఛైర్మన్ ఇంట్లోకి మృతదేహాలు..
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.