ఏ బంధమైనా సరే ప్రేమ, నమ్మకం వంటి వాటితోనే కలకాలం ఆనందంగా ఉంటుంది. ముఖ్యంగా దాంపత్య విషయంలో దంపతులిద్దరూ చాలా అన్యోన్యతతో మెలగాలి. ప్రతి విషయంలోనూ ఒకరికొకరు తోడుగా నిలవాలి. ప్రతి క్షణాన్ని ఆస్వాదించాలి. ఆలుమగల మధ్య డిష్యూం డిష్యూం కామన్. ఎంత వద్దనుకున్నా చిన్న చిన్న గొడవలు వస్తూనే ఉంటాయి. అవి ఉంటేనే లైఫ్ బోర్ కొట్టకుండా ఉంటుంది. అయితే, గొడవలు మరీ పెద్దవి కాకుండా సంయమనం పాటించాలి. అలాకాకుండా నువ్వెంత అంటే నువ్వెంత అన్నారా! ఈ దంపతుల్లా ఇంట్లోని వస్తువులను సమయం ప్రాతిపదికన పంచుకోవాల్సి ఉంటుంది.
అర్ధరాత్రి బెడ్ రూంలో మంచం కోసం భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. భర్త తనకు బెడ్ కావాలని కోరగా, భార్య అందుకు అంగీకరించలేదు. దీంతో లాగి పెట్టి ఒకటి కొట్టాడు. అంతే.. ఆమె పోలీస్ పోలీస్ మెట్లెక్కింది. పోలీస్ బాసులు బాసులు అతన్ని కటకటాల పాలు చేశారు. అసలు వాళ్లిద్దరూ భార్యాభర్తలు కదా! ఒకే బెడ్ పై పడుకోవచ్చు కదా కొట్టుకోవడం ఎందుకు..? అని మీకు సందేహం రావొచ్చు. అందుకు అవకాశమే లేదు. కారణమేంటన్నది ఇప్పుడు చూద్దాం.. మహారాష్ట్ర రాజధాని ముంబై పరిధిలోని బొరివ్లీ ప్రాంతంలో నివసిస్తున్న ఓ జంట మధ్య గత కొన్నాళ్లుగా గొడవలు జరుగుతున్నాయి. ఇద్దరికీ ఒకరంటే ఒకరు గిట్టని పరిస్థితి ఏర్పడింది. ఒకరు ముఖం మరొకరు చుకోలేనంతంగా పగను పెంచుకున్నారు. ఈ క్రమంలో భర్త ప్రవర్తనపై విసిగిపోయిన భార్య గతేడాది తనకు విడాకులు కావాలని కోరింది. అయితే, అందుకు భర్త ఒప్పుకోలేదు.
ఇద్దరూ అంగీకరిస్తేనే కోర్టు విడాకులు మంజూరు చేస్తుంది. కానీ, భర్త అందుకు అంగీకరించట్లేదు. ఇక చేసేదేమి లేక భార్య అతనితో పొసగకపోయినా అదే ఇంట్లో ఉంటోంది. అయితే.. ఇంట్లో వస్తువులను, పనులను మాత్రం సమంగా పంచుకుని కాపురం చేస్తున్నారు. టీవీ, మంచం లాంటి విడదీయలేని వస్తువులను టైమింగ్ పెట్టుకుని వంతుల వారీగా వాడుకుంటున్నారు. ఈ క్రమంలో శనివారం(జనవరి 28) రాత్రి ఒంటిగంట సమయంలో భర్త.. మంచంపై నిద్రిస్తున్న భార్యను గంభీరంగా అరుస్తూ నిద్రలేపాడు. తనకు అసౌకర్యంగా ఉందని.. కాసేపు రెస్ట్ తీసుకోవాలని మంచం మీద నుంచి భార్యను లెమ్మన్నాడు. అందుకు ఆమె ఒప్పుకోకపోగా, ఇది నా టైమ్ నేను మంచం దిగను అని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పింది.
దీంతో ఇద్దరి మధ్య వాడీవేడీగా మరోసారి గొడవ జరిగింది. అంతే.. సహనం కోల్పోయిన భర్త ఆగ్రహంతో భార్య చెంపపై గట్టిగా చరిచాడు. చేయి కాస్త ఆమె చెవిపై తగలడంతో కీస్‌మన్న శబ్దమే తప్ప వినికిడి లేకుండా పోయింది. అనంతరం భార్య, ఆమె తన స్నేహితురాలి సహాయంతో ఆస్పత్రికి వెళ్లగా, పరీక్షించిన వైద్యులు లోపలి చెవి దెబ్బతిన్నదని చెప్పారు. అంతే, అక్కడి నుంచి నేరుగా బొరివ్లీ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి భర్తపై ఫిర్యాదు చేసింది. దీంతో ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 325 కింద ఆమె భర్తపై కేసు నమోదు చేసిన పోలీసులు.. అతనిని కటకటాల వెనక్కిపంపారు. ఈ విషయం తెలిసిన నెటిజన్లు ‘భార్య బాధితుడు ఈ భర్త’ అంటూ అతనికి సానుభూతి తెలుపుతూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ భర్తపై.. మీ అభిప్రాయాలేంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి.