వారిద్దరూ ప్రేమించుకున్నారు. ప్రేమ మైకంలో వారిద్దరూ ఒకరోజు శారీరకంగా దగ్గరయ్యారు. దీంతో ఆమె గర్భం దాల్చింది. టెన్షన్‌కు గురైన ఆమె, ప్రియుడి సలహాతో.. గర్భాన్ని తొలగించుకునేందుకు యూట్యాబ్ వీడియోలు చూసి తనకు తానే వైద్యం చేసుకొని ప్రాణాల మీదకు తెచ్చుకుంది. ఈ ఘటన మహారాష్ట్రలోని నాగ్‌పుర్‌లో చోటుచేసుకుంది.
వివరాల ప్రకారం.. నాగ్‌పుర్‌లోని నార్ఖేడ్కు చెందిన 27 ఏళ్ల వ్యక్తి 17 ఏళ్ల బాలికను ప్రేమపేరుతో లొంగదీసుకున్నాడు. ఆరు నెలల క్రితం ఆ బాలిక.. తన బాయ్‌ఫ్రెండ్ ఇంటికి వెళ్లింది. శారీరక కలయిక ద్వారా గర్భం దాల్చింది. ఈ విషయాన్ని తన బాయ్‌ఫ్రెండ్‌కు చెప్పింది. ఆ యువకుడు కొన్ని మందులు తీసుకుంటే.. అబార్షన్ అవుతుందని చెప్పాడు. అవి బయట దొరకలేదు. ఈ విషయాన్ని ప్రియుడికి చెప్పగా అతడు ఏవో మందు వేసుకుంటే అబార్షన్ అవుతుందని సూచించాడు. దీంతో కుటుంబ సభ్యులకు ఈ విషయం తెలిసిపోతుందని భయపడిన బాలిక.. యూట్యూబ్‌లో అన్వేషణ ప్రారంభించింది.
ఇది కూడా చదవండి: పక్కింటి యువకుడితో పిల్లల తల్లి ప్రేమాయణం.. భర్త లేని సమయం చూసి!
అబార్షన్ మందుల కోసం యూ ట్యూబ్‌లో సెర్చ్ చేసింది. ఓ మందును కొనుగోలు చేసి వాటిని వేసుకుంది. దీంతో అనారోగ్యానికి గురైంది. అనుమానం వచ్చి తల్లి ఆరా తీయగా అసలు విషయం చెప్పింది. అనంతరం వెంటనే ఆమెను వైద్యం కోసం నాగపూర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. చికిత్స చేసిన తర్వాత ఆమె ఆరోగ్యం మెరుగైందని వైద్యులు తెలిపారు. బాధితురాలి తల్లి ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. బాధితురాలి బాయ్‌ఫ్రెండ్ వివరాలను సేకరించారు. కేసు నమోదు చేసి పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.
ఇది కూడా చదవండి: ‘నుదుట కుంకుమ బొట్టు పెట్టుకుంటే చంపుతా’..మహిళకు పోలీస్ బెదిరింపులు..