చరిత్రలో చోటు చేసుకున్న అనేకానేక యుద్ధాలకు మూల కారణం అవమానం. పది మంది ఎదుట.. మనల్ని చులకన చేస్తూ మాట్లాడి.. ఎగతాళి చేసి.. అక్కడికి ఆగక మనపై దాడి చేస్తుంటే.. దాన్ని ప్రతిఘటించలేక.. తిరగబడలేక.. దాన్నుంచి తప్పించుకోలేక తల దించుకుని.. మౌనంగా వాటిని భరించడం.. చావును జయించినంత కష్టం. మన జీవితంలో కష్టాలను, సుఖాలను బాధలను కూడా కొన్ని సందర్భాల్లో మరిచిపోతామేమో కానీ.. అవమాన భారాన్ని వదిలించుకోలేం. నిత్యం అది మన హృదయాలను దహించివేస్తుంది. కళ్లముందు నిత్యం కదలాడుతూనే ఉంటుంది. కొందరేమో మా తలరాత ఇంతే అని బాధపడి సరిపెట్టుకుంటారు. మరి కొందరు అవమాన భారాన్ని తట్టుకోలేక.. తమను అవమానించిన వారిని ఏం చేయలేక.. తనువు చాలిస్తారు. కానీ కొందరు మాత్రం.. తమను అవమానించిన వారిని.. అంతకు అంత అవమానించి ప్రతీకారం తీర్చుకుంటారు. ఈ క్రమంలో తాజాగా అవమాన భారం తట్టుకోలేక ఓ యువతి ప్రాణాలు తీసుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది. ఆ వివరాలు..
తరగతి గదిలో ఇద్దరు విద్యార్థినిల మధ్య జరిగిన ఓ గొడవ.. స్టూడెంట్ ఆత్మహత్యకు దారి తీసరింది. గొడవలో భాగంగా ఓ విద్యార్థిని.. తోటి స్టూడెంట్ చెంప మీద కొట్టింది. ఈ సంఘటనను కాస్త వీడియో తీసి వైరల్ చేయడంతో.. బాధిత విద్యార్థిని ఆత్మహత్య చేసుకుని మృతి చెందింది. ఈ విషాదకర సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా.. జడ్చర్లలో చోటు చేసుకుంది. ఆ వివరాలు.. నాగర్‌కర్నూలు జిల్లా తిమ్మాజీపేట మండటలం హనుమాన్‌తండాకు చెందిన ముడావత్ మైనా(19) అనే యువతి జడ్చర్లలోని బీఆర్‌ఆర్ డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతోంది. ఈ క్రమంలో మంగళవారం మైనాకు తోటి విద్యార్థిని దేవయానితో గొడవ అయ్యింది.
ఈ క్రమంలో దేవయాని మైనా చెంప మీద కొట్టింది. అయితే వీరిద్దరూ గొడవపడుతుండగా కొందరు విద్యార్థులు వీడియో తీసి దాన్ని వైరల్ చేశారు. ఇక ఈ వీడియోలో దేవయాని.. మైనా చెంప పగలకొట్టడం కూడా ఉంది. దాంతో ఈ విషయం ప్రిన్సిపాల్‌కు, ఇతర లెక్చరర్లకు తెలియడంతో.. వారు అదే రోజు విద్యార్థినిలను పిలిపించి.. కౌన్సెలింగ్ ఇచ్చి.. సర్ది చెప్పారు. కానీ దేవయాని చెంప మీద కొట్టడం, ఆ వీడియో కాలేజీలో అందరూ చూడటంతో.. మైనా తీవ్ర మనస్థాపానికి గురయ్యి.. పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది.
మైనా ఆత్మహత్య చేసుకోవడంతో ఆమె తల్లిదండ్రులు, బంధువులు.. కాలేజీ వద్ద ఆందోళనకు దిగారు. లోపలికి వెళ్లి.. ప్రినసిపాల్, లెక్చరర్లతో గొడవకు దిగారు. తమ బిడ్డపై దాడి జరిగితే.. దాని గురించి తమకు ఎందుకు చెప్పలేదని మైనా తల్లిండ్రులు ప్రిన్సిపాల్‌ను నిలదీశారు. ఈ గొడవ జరుగుతున్న సమయంలో ప్రిన్సిపాల్ అస్వస్థతకు గురై.. స్పృహ కోల్పోయారు. వైద్యుడిని పిలిపించి.. ఆమెకు చికిత్స అందించారు. అయితే ఓ లెక్చరర్, ఇద్దరు విద్యార్థినిల వేధింపుల కారణంగానే తమ బిడ్డ ఆత్మహత్య చేసుకుందని మైనా తల్లిదండ్రులు ఆరోపించారు. లెక్చరర్ వేధింపుల కారణంగానే మైనా ఆత్మహత్య చేసుకుందనే ఫ్లెక్సీని ప్రదర్శించారు.
ఫోటో కారణంగా మైనా, దేవయానిల మధ్య గొడవ జరిగింది. ఇక మైనాతో పాటు చదువుతున్న ఓ పెళ్లైన విద్యార్థిని.. క్లాస్ రూమ్‌లో తోటి విద్యార్థులైన అబ్బాయిలతో మాట్లాడుతుండగా.. మైన ఫోటో తీసి.. వాటిని సదరు విద్యార్థిని భర్త స్నేహితుడికి పంపడంతో గొడవ జరిగింది. ఈ విషయంలో వివాహిత విద్యార్థిని స్నేహితురాలు దేవయాని జోక్యం చేసుకుని.. మైనాను ఫోటోల గురించి ప్రశ్నించింది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య గొడవ జరగడం.. దేవయాని మైనా చెంప మీద కొట్టడం జరిగిందని ప్రిన్సిపాల్ వివరించారు. తర్వాత ముగ్గురు విద్యార్థినిలను పిలిచి మాట్లాడామని.. తెలిపారు. కానీ మైనా మాత్రం జరిగిన దాన్ని తేలిగ్గా తీసుకోలేకపోయింది. ఆత్మహత్య చేసుకుంది.
ఇక ఉన్నత చదువులు చదువుతున్న అమ్మాయి మైనా ఇలా ప్రవర్తించడాన్ని చాలా మంది తప్పు పడుతున్నారు. తోటి విద్యార్థులతో మాట్లాడటం తప్పు ఎలా అవుతుంది.. అందులోను వారికి తెలియకుండా ఫోటోలను తీయడమే కాక.. వాటిని విద్యార్థిని భర్త స్నేహితుడికి పంపడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. చదువుకున్న అమ్మాయి ఇలా ప్రవర్తించడం ఏంటని అసహనం వ్యక్తం చేస్తున్నారు.