ఈ రోజుల్లో చాలా మంది ప్రేమిస్తున్నామని వెంటపడుతున్నారు. తీరా ఆ యువతి అతనికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పెళ్లి చేసుకుంటానని నమ్మిస్తున్నారు. ఇక ఇంతటితో ఆగుతున్నారా అంటే అదీ లేదు. సరిగ్గా ఇలాగే హద్దులు దాటిన ఓ యువకుడు ప్రేమ పేరుతో వంచించి తన కోరికలు తీర్చకుని చివరికి ప్రేమించిన అమ్మాయిని కాదు పొమ్మన్నాడు. ప్రియుడి మోసాన్ని జీర్ణించుకోలేకపోయిన ఆ యువతి ఊహించిన నిర్ణయం తీసుకుంది. ఇటీవల మహబూబాబాద్ లో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అది మరిపడ మండలం అజ్మీరతండా. ఇదే గ్రామానికి భూక్య అనూష(18) స్థానికంగా ఉన్న ప్రభుత్వ కళాశాలలో ఇంటర్ చదువుతోంది. అయితే అప్పటి వరకు తనదారిలో వెళ్తున్న అనూషకు అదే తండాకు చెందిన శేఖర్ అనే యువకుడు పరిచయం అయ్యాడు. ట్రాక్టర్ డ్రైవర్ గా పని చేస్తున్న శేఖర్ గత కొంత కాలంగా అనూషతో పరిచయం పెంచుకున్నాడు. దీంతో ప్రేమిస్తున్నానని వెంటపడడంతో ఆ యువతి డైలమాలో పడింది. ఏం చేయాలో అర్థంకాక అతగాడి ప్రేమను ఎట్టకేలకు స్వాగతించింది. అనంతరం ఒకరి మనసులు ఒకరు అర్థం చేసకుని కొన్నాళ్ల పాటు ప్రేమించుకున్నారు. కాగా ఈ క్రమంలోనే శేఖర్ ఆ యువతిని పెళ్లి కూడా చేసుకుంటానని నమ్మించి శారీరక కోరికలు కూడా తీర్చుకున్నాడు. ఈ నేపథ్యంలోనే వీరిద్దరి ప్రేమ వ్యవహారం యువతి ఇంట్లో తెలిసింది.
అయితే అనూష తల్లిదండ్రులు అతనితో పెళ్లి చేసేందుకు ఇష్టపడగా, శేఖర్ తల్లిదండ్రులు మాత్రం వీరి పెళ్లికి నిరాకరించారు. ఇదే విషయంపై శేఖర్ తల్లిదండ్రులు అతడిపై ఆగ్రహానికి గురయ్యారు. ఈ క్రమంలోనే శేఖర్ సైతం అనూషను పెళ్లిచేసుకోవడానికి కాస్త ఆలోచనలో పడి వెనకడుగు వేశాడు. ప్రియుడ పెళ్లికి నిరాకరించడంతో అనూష తీవ్ర మనస్థాపానికి గురైంది. ఏం చేయాలో అర్థం కాక ఇటీవల ఇంట్లో ఎవరూ లేని టైమ్ ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు విడిచింది. ఈ విషయం తెలుసుకున్న అనూష తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. అనంతరం అనూష తల్లిదండ్రులు ఆమె ప్రియుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఈ విషాద ఘటనపై మీ అభిప్రాయలను కామెంట్ రూపంలో తెలియజేయండి.