ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కలకాలం పిల్లా పాపలతో సంతోషంగా జీవించాలనుకున్నారు. కానీ పెళ్లైన కొన్నాళ్లకే భర్త రాక్షసుడిలా తయారయ్యాడు. ఆ వ్యసనానికి బానిసై కట్టుకున్న భార్యకు రోజూ నరకం చూపించాడు. భర్త దారుణాన్ని భరించలేని భార్య కొన్నాళ్లకి పుట్టింటికి వెళ్లడమే పాపమైంది. కట్ చేస్తే భార్య రక్తపు మడుగులో పడి ప్రాణాలు విడిచింది. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. అసలేం జరిగిందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. మహబూబాబాద్ జిల్లాలోని భవానినగర్ ప్రాంతం. ఇక్కడే జటోత్ భాస్కర్, కల్పన అనే దంపతులు గత 15 ఏళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.
పెళ్లైన కొంత కాలానికి వీరికి ముగ్గురు ఆడ పిల్లలు జన్మించారు. ఇక భర్త భాస్కర్ ఎక్కడా కూడా సరిగ్గా పని చేయకుండా జులాయిగా తిరుగుతూ ఉండేవాడు. ఈ నేపథ్యంలోనే వీరి సంసారం గడవడం కాస్త భారంగా మారింది. దీంతో భార్య కల్పన అక్కడక్కడ పని చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొచ్చింది. ఈ క్రమంలోనే భర్త భాస్కర్ తాగుడుకు బానిసై రోజూ మద్యం మత్తులోనే ఉండేవాడు. మద్యానికి డబ్బులు లేకపోతే భార్యను ఇవ్వాలంటూ గొడవకు కూడా దిగేవాడు. భర్త వేధింపులను భరించలేని భార్య తన ముగ్గురు పిల్లలతో కలిసి పుట్టింటికి వెళ్లింది. అక్కడే కొన్ని రోజలు పనులకు కూడా వెళ్లింది. దీంతో అనేక సార్లు భర్త భార్యను ఇంటికి రావాలంటూ కబురు పంపాడు.
తాగుడుకు బానిసై సంసారాన్ని నాశనం చేస్తున్న నీ వద్దకు రానంటూ తెగేసి చెప్పి నచ్చ జెప్పే ప్రయత్నం చేసింది. అయినా భర్త మద్యం తాగడం మాత్రం ఆపలేదు. దీంతో ఇటీవల భర్త మద్యం తాగి కల్పన పుట్టింటికి వెళ్లాడు. అనంతరం భార్య కల్పనపై కోపంతో ఊగిపోయిన భాస్కర్ మద్యం మత్తులో కత్తితో భార్యను దారుణంగా హత్య చేశాడు. భర్త దాడిలో భార్య తీవ్రంగా గాయపడి రక్తపు మడుగులో పడి అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. ఈ ఘటనపై కల్పన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. ఈ దారుణ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.