పైన ఫొటోలో అమాయకంగా కనిపిస్తున్న మహిళ పాత బ్యాగులకు జిప్ లు వేస్తామంటూ వీధి వీధి తిరుగుతూ జీవనాన్ని కొనసాగిస్తుంది. రోజూ ఒక గ్రామానికి వెళ్తూ తనకు వచ్చిన వృత్తితో పూట గడుపుకుంటుంది. ఇకపోతే ఆ మహిళ ఇటీవల ఓ గ్రామానికి వెళ్లి వీధి వీధి తిరుగుతూ ఉంది. ఈ క్రమంలోనే ఆ మహిళ ఓ ఇంటికి ముంగిటకు వెళ్లింది. ఆ ఇంట్లో నుంచి ఓ మహిళ ఆమెను ఇంట్లోకి పిలిచింది. మా ఇంట్లో జిప్ లు పోయిన పాత బ్యాగులు ఉన్నాయి, వాటికి జిప్ లు వేయాలంటూ చెప్పింది. దీనికి ఆ మహిళ సరేనంటూ జిప్ లు వేసింది. ఇక డబ్బులు తెస్తానని ఆ మహిళ ఇంట్లోకి వెళ్లి వచ్చే సరికి ఆ మహిళ ఊహించని పని చేసింది. ఈ సీన్ ను చూసిన ఆ మహిళ ఒక్కసారిగా నోరెళ్లబెట్టింది. బ్యాగులకు జిప్ లు వేసే మహిళ ఏం చేసింది? అసలు ఈ ఘటన ఎక్కడ జరిగిందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
అది మహబుబాబాద్ జిల్లా బయ్యారం మండలంలోని ఓ గ్రామం. అయితే తాజాగా పాత బ్యాగులకు జిప్ లు వేస్తామంటూ ఓ మహిళ గంగ దేవి వీధిలో అరుస్తూ తిరుగుతుంది. ఈ క్రమంలోనే ఓ మహిళ ఇంట్లో నుంచి వచ్చి.. మా పాత బ్యాగ్ రిపేర్ చేయాలని చెప్పింది. దీంతో ఆ మహిళ సరేనంటూ ఇంట్లో నుంచి తెచ్చిన బ్యాగును రిపేర్ చేసింది. ఇక డబ్బుల కోసం ఆ మహిళ తన సెల్ ఫోన్ ను ఆ బ్యాగ్ లు రిపేర్ చేసే మహిళ వద్ద ఉంచి ఇంట్లోకి వెళ్లింది. ఇదే మంచి సమయం అనుకున్న ఆ మహిళ ఆ ఫోన్ ను తీసుకుని అక్కడి నుంచి పరారైంది.
డబ్బుల కోసం ఇంటి యజమానురాలు బయటకు వచ్చి చూడగా.. ఆ మహిళ కనిపించలేదు, ఆమె సెల్ ఫోన్ కనిపించలేదు. దీంతో ఆ ఇంటి ఓనర్ ఖంగారుపడి ఆ మహిళ కోసం గాలించగా చివరికి ఓ చోట దొరికింది. ఆమె బ్యాగులో వెతికి చూడగా ఆ మహిళ సెల్ ఫోన్ దొరికింది. దీంతో అనంతరం స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చింది. హుటహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సెల్ ఫోన్ దొంగిలించిన మహిళను అదుపులోకి తీసుకున్నారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.