ఈ మధ్యకాలంలో కొంతమంది నవ వధువులు పెళ్లై నెల రోజులు కాకముందే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇటీవల విశాఖలో సృజన అనే అమ్మాయి పెళ్లి రోజు పెళ్లి పీటలపై హఠాత్తుగా మరణించిన విషయం తెలిసిందే. ఇలా వారం రోజులు కాకముందే అంతుచిక్కని కారణాలతో హఠాత్తుగా నవ వధువులు చనిపోతున్నారు. అచ్చం ఇలాంటి ఘటనలోనే ఓ నవ వధువు ఇష్టం లేని పెళ్లి చేశారని పెళ్లి రోజే సాయంత్రం ఆత్మహత్యకు పాల్పడింది. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్యనీయాంశమవుతోంది.
ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే..మహబూబ్ నగర్ ప్రాంతానికి చెందిన గుజ్జుల పద్మ అనే మహిళ వ్యవసాయ కూలీగా పని చేస్తూ జీవనాన్ని కొనసాగిస్తూ ఉంది. ఇక ఆమెకు నలుగురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఎంతో కష్టపడి.. పిల్లలను పెంచి పెద్ద చేసింది. పెద్ద కుమార్తె లక్ష్మీ వయసు 18. పదో తరగతి వరకు చదివి ఇంటికి వద్దే ఉంటోంది. ఇటీవలే ఆమెకు కటుుంబ సభ్యులు పెళ్లి నిశ్చయించారు. తన చిన్నమ్మ తమ్ముడు మల్లిఖార్జున్‌కు ఇచ్చి చేయాలని పెద్దలు నిర్ణయించారు. వీరి స్వస్థలం అనంతపూర్ జిల్లా. అంతదూరంలోని పెళ్లి సంబంధం తనకు ఇష్టం లేదని ఆ యువతి అనేక సార్లు తల్లికి వివరించి చెప్పే ప్రయత్నం చేసింది. దూర ప్రాంతమయితే ఏమవుతుంది? ఇది మంచి సంబంధం అని తల్లి, కుటుంబ సభ్యులు నచ్చజెప్పారు. ఇక ఇష్టం లేకున్నా పెళ్లి చేస్తున్నారని లక్ష్మీ తీవ్ర మనస్థాపానికి గురైంది.
ఇది కూడా చదవండి: Bride Srujana : విశాఖ వధువు మృతిపై స్పందించిన సోదరుడు!ఇక శుక్రవారం ఉదయం 9గంటలకు వివాహం జరిగితే.. అదే రోజు సాయంత్రం అప్పగింతలకు ముందే నవ వధువు విషం తాగి ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో వెంటనే స్పందించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన జిల్లాలోని ఓ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు లక్ష్మీ అప్పటికే చనిపోయిందని నిర్ధారించారు. ఈ విషయం తెలుసుకున్న యువతి బంధువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇక లక్ష్మీ విషయంలో కుటుంభికులు అత్తగారి ఇల్లు దూరంగా ఉందని తనకు ఇష్టం లేదని చెప్పినా వినకుండా బలవంతంగా పెళ్లి చేయడంతో ఓ నిండు ప్రాణం బలైంది. ఇలా అనేక మంది తల్లిదండ్రులు కుమార్తెల ఇష్టాలను లెక్కచేయకుండా వారి ఇష్టం మేరకు పెళ్ళిళ్లు చేస్తూ చివరికి ఆత్మహత్యలు చేసుకునే స్థాయికి తెచ్చుకుంటున్నారు. ఇలా మెన్న సృజన , నిన్న శ్వేత, నేడు లక్ష్మీ ఇలా కారణాలు వేరైన ఇష్టం లేని పెళ్లిళ్లు చేస్తుండడంతో ఆత్మహత్యలకు పాల్పడుతుండం తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఇష్టం లేకున్నా పెళ్లి చేయడంతో మరణించిన లక్ష్యీ విషయంలో మీ అభిప్రాయాలన కామెంట్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.