ఇద్దరిదీ ఒకే ఊరు కావడంతో కాస్త పరిచయం ఉండేది. ఈ పరిచయంతోనే ఇద్దరూ ప్రేమించుకున్నారు. పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. ఈ క్రమంలోనే పెద్దలను ఒప్పించి పెళ్లి కూడా చేసుకున్నారు. కట్ చేస్తే.. వివాహం జరిగి వారం రోజులు గడవకముందే!
వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు. ఒకరి మనసులు ఒకరు అర్థం చేసుకున్నారు. కొన్నాళ్ల నుంచి పీకల్లోతు ప్రేమలో మునిగితేలారు. కొంత కాలానికి ఒకరిని విడిచి మరొకరు ఉండలేనంతగా మారిపోయారు. పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. కానీ, మొదట్లో ఇరువురి పెద్దలు వీరి పెళ్లికి అంగీకరించలేదు. మొత్తానికి ఎలాగో ఇరువురి కుటుంభికులను ఒప్పించారు. దీంతో ఇటీవలే పెళ్లి కూడా చేసుకున్నారు. వివాహం జరిగి వారం రోజులు గడిచిందో లేదో ఉన్నట్టుండి ఊహించని పరిణామం చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే?
పోలీసుల కథనం ప్రకారం.. మహబూబ్ నగర్ జిల్లా నవాబుపేట మండలంలోని ఓ ప్రాంతం. ఇక్కడే పిల్లి అనూష, బోయని శివశంకర్ లు నివాసం ఉంటున్నారు. ఇద్దరిదీ ఒకే ఊరు కావడంతో కాస్త పరిచయం ఉండేది. ఈ పరిచయంతోనే ఇద్దరూ ఇంకాస్త దగ్గరై చివరికి ప్రేమించుకున్నారు. అలా కొంత కాలం పాటు ఇద్దరూ పీకల్లోతు ప్రేమలో మునిగిపోయారు. పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్నారు. కానీ, మొదట్లో ఇరువురి కుటుంభికులు అంగీకరించలేదు. ఆ తర్వాత ఇద్దరి పెద్దలు అంగీకరించడంతో ఈ నెల 12న పెళ్లి కూడా చేసుకున్నారు.
ఇదిలా ఉంటే ఈ నెల 15న పెళ్లి కూతురు తల్లి నూతన దంపతులను తన ఇంటికి తీసుకెళ్లింది. ఇక మరుసటి రోజు శివ శంకర్ అనూషను తన ఇంటికి తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. కానీ, దీనికి పెళ్లి కూతురు తల్లి అంగీకరించలేదు. మంగళవారం రోజు కొత్త పెళ్లి కూతురు గడప దాటకూడదంటూ తల్లి వివరించి చెప్పింది. ఇది వినని కూతురు అనూష.. నా భర్తతో పంపించడం లేదంటూ తీవ్ర మనస్థాపానికి గురైంది. ఈ క్రమంలోనే బుధవారం ఇంట్లో ఎవరూ లేని టైమ్ లో పెళ్లి కూతురు అనూష పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది.
ఆమె కుటుంబ సభ్యులు వెంటనే స్పందించి స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఇక చికిత్స పొందుతూ గురువారం ప్రాణాలు కోల్పోయింది. దీంతో ఆమె తల్లి గుండెలు పగిలేలా ఏడ్చారు. పెళ్లై వారం రోజులు కూడా గడవకముందే అనూష మరణించడంతో ఆమె భర్త శివ శంకర్ కన్నీరు మున్నీరుగా విలపించారు. అనంతరం ఈ ఘటనపై మృతురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పెళ్లైన వారం రోజులకే ప్రాణాలు కోల్పోయిన అనూష ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.