ప్రేమ పేరుతో అమ్మాయిల చుట్టు చెప్పులు అరిగేలా తిరగడం, యువతి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాక కావాల్సిన కోరికలు తీర్చుకుని కాదు పొమ్మనడం. ఇవే నేటి కాలంలో జరుగుతున్న మోసాలు. ఇలా మోసపోయిన ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసినా న్యాయం చేయకపోవడంతో ఏకంగా ప్రియుడి ఇంటి ముందే ధర్నాకు దిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన మహబూబ్ నగర్ జిల్లాలో చోటు చేసుకుంది. ఇక వివరాల్లోకి వెళ్తే.. మహబూబ్‌నగర్ జిల్లా నవాబ్ పేట మండలం దేపల్లి. ఇదే గ్రామానికి చెందిన మల్కాపురం సత్యనారాయణగౌడ్, పిట్టల రేణుక ఇద్దరు చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్నారు.
ఇద్దరి మధ్య స్నేహం పెరగడంతో కలిసి తిరిగారు. చివరికి సత్యనారాయణ ప్రేమిస్తున్నానంటూ రేణుకను నమ్మించి వెంటపడ్డాడు. ఒకే ఊరు, తెలిసిన వ్యక్తి కావడంతో రేణుక కూడా అతగాడి ప్రేమకు స్వాగతం పలికింది. దీంతో వీరిద్దరు గత 8 ఏళ్ల నుంచి ప్రేమించుకుంటున్నారు. కలిసి తిరిగారు, ఎంజాయ్ చేశారు. అయితే ఎలాగైన ప్రియుడినే పెళ్లి చేసుకోవాలని రేణుక భావించింది. ఇందులో భాగంగా వీరిద్దరూ కలిసి ఇటీవల హైదరాబాద్ లోని ఓ ఆర్యసమాజ్ లో పెళ్లి చేసుకున్నారు.
ఇది కూడా చదవండి: YSR District: భర్తను చేసుకున్నందుకు ఏనాడు సుఖం దక్కలేదు.. అలా చేయొద్దంటూ మొత్తుకున్నా వినకుండా!
వేద మంత్రాల సాక్షిగా ప్రియుడు రేణుక మెడలో తాళికట్టడంతో ఆమె సంతోషానికి హద్దులు లేకుండా పోయాయి. ఇక అనంతరం ఇద్దరు కలిసి ఓ చోట కాపురం పెట్టారు. ఐదు రోజులు గడిచిందో లేదో అప్పుడే భర్త సత్యనారాయణ భార్యను వదిలి వెళ్లిపోయాడు. భర్త వెళ్లిపోవడంతో భార్య రేణుక ఒక్కసారిగా షాక్ కు గురైంది. ఏం చేయాలో తెలియక స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసుల వద్ద సరైన న్యాయం దొరకదేమోనని భావించిన రేణుక ఏకంగా భర్త ఇంటి ముందే నాకు న్యాయం చేయాలంటూ ధర్నాకు దిగింది.
దీంతో సత్యనారాయణ తల్లిదండ్రులు ఇంటికి తాళం వేసి ఎక్కడికో పారిపోయారు. ఇక ఎలాగైన నాకు న్యాయం జరిగేంత వరకు ఇక్కడి నుంచి వెళ్లేది లేదని రేణుక డిమాండ్ చేస్తుంది. సత్యనారాయణ షాద్ నగర్ లో ఉన్నాడని, అతనిని కుటుంబ సభ్యులు అతనిని దాచి పెట్టారని నవ వధువు రేణుక తన ఆవేదనను వ్యక్తం చేస్తుంది. ఇటీవల వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఈ ఘటనపై మీ అభిప్రాయలను కామెంట్ రూపంలో తెలియజేయండి.