ఆమె గతంలో ఓ వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. పెళ్లైన కొంత కాలానికి ఈ దంపతులకు రత్నాల్లాంటి ఇద్దరు పిల్లలు జన్మించారు. ఇక అంత బాగానే ఉందనుకున్న తరుణంలోనే ఆ మహిళ ఉన్నట్టుండి ఊహించని నిర్ణయం తీసుకుంది. అసలేం జరిగిందంటే?
ఆమెకు పెళ్లై రత్నాల్లాంటి ఇద్దరు పిల్లలు ఉన్నారు. పుట్టిన పిల్లలను చదివించుకుంటూ ఈ దంపతులు సంతోషంగానే ఉన్నారు. ఇక భర్త స్థానికంగా ఉండే ఓ కంపెనీలో పని చేస్తున్నాడు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా వీరి కాపురం సజావుగానే సాగుతూ ఉంది. ఇదిలా ఉంటే.. ఇటీవల ఆ మహిళ భర్త నైట్ డ్యూటీకి వెళ్లాడు. ఇంట్లో ఇద్దరు పిల్లలతో కలిసి ఆ మహిళ షాకింగ్ డెసిషిన్ తీసుకుంది. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. అసలేం జరిగిందంటే?
పోలీసుల కథనం ప్రకారం.. మహబూబ్ నగర్ జిల్లా నవాబుపేట మండలం కూచూరు గ్రామం. ఇదే ఊరిలో తుప్పుడ లింగం-మంజుల దంపతులు నివాసం ఉంటున్నారు. వీళ్లు పదేళ్ల కిందట ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లైన చాలా కాలం పాటు ఈ దంపతుల కాపురం సాఫీగానే సాగుతూ వచ్చింది. అలా కొన్నేళ్ల తర్వాత ఈ భార్యాభర్తలకు ఓ కూతురు, కుమారుడు జన్మించారు. ఇక భర్త స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇదిలా ఉంటే.. ఆదివారం రాత్రి ఈ దంపతులు ఇద్దరు పిల్లలతో పాటు కలిసి భోజనం చేశారు. ఆ తర్వాత భర్త నైట్ డ్యూటీకి వెళ్లాడు.
లింగం డ్యూటీ ముగించుకుని మరుసటి రోజు ఉదయం ఇంటికి వచ్చాడు. కానీ, ఇంట్లో భార్యతో పాటు ఇద్దరు పిల్లలు కనిపించలేదు. ఖంగారుపడి అటు ఇటు అంతటా వెతికాడు. ముగ్గురూ ఎక్కడా కనిపించలేదు. వెంటనే బంధువుల ఇంటికి ఫోన్ చేసి భార్యా పిల్లల ఆచూకి గురించి అడిగి తెలుసుకున్నాడు. వారి సమాచారం మాత్రం దొరకలేదు. ఇక చేసేదేం లేక భర్త లింగం స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరో విషయం ఏంటంటే? గత మూడేళ్ల కిందట కూడా భార్యా కనిపించకుండాపోయి మళ్లీ తిరిగి ఇంటికి వచ్చినట్లు సమాచారం. అయితే ఉన్నట్టుండి మరోసారి మంజులతో పాటు పిల్లలు కనిపించకపోవడంతో ఆమె భర్తతో పాటు కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది.