ప్రపంచంలో ప్రతిరోజూ ఎక్కడో అక్కడ పదుల సంఖ్యలో రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. కేవలం డ్రైవర్ల నిర్లక్ష్యం వల్లే ఎన్నో నిండు ప్రాణాలు బలి అవుతున్నాయి. అతి వేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి.
ప్రతిరోజూ ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. అతి వేగం, డ్రైవర్ల నిర్లక్ష్యం వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు అంటున్నారు. ఎన్నో ఆశలతో ఉన్నత విద్యనభ్యసించడానికి విదేశాలకు వెళ్లిన భారతీయ విద్యార్థులు దురదృష్టవశాత్తు రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. అమెరికా లో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన ఓ విద్యార్థి ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబ కన్నీరు మున్నీరవుతున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
తెలంగాణ మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ జిల్లా కపెట్ట గ్రామానికి చెందిన బోయ మహేష్.. వయసు 25 సంవత్సరాలు. ఉన్నత విద్యనభ్యసించడానికి గత డిసెంబర్ నెలలో అమెరికాకి వెళ్లాడు. అక్కడ కాంకోర్డియా యూనివర్సిటలో ఎంఎస్ చేస్తున్నాడు. మహేష్ తో పాటు మరో ముగ్గురు మిన్నెసోటా స్టేట్ కి వెళ్లారు. మంగళవారం రాత్రి తన ముగ్గురు స్నేహితులు శివ, శ్రీలక్ష్మి, భరత్ తో కలిసి లాంగ్ డ్రైవ్ కి వెళ్లారు. అర్థరాత్రి కావడంతో వీరి కారు అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టుకు ఢీ కొట్టి అవతల పడిపోయింది. దీంతో ప్రమాదంలో మహేష్ స్పాట్ లోనే చనిపోయాడు.. మిగిలిన వారికి గాయాలు కావడంతో ఆస్పత్రిలో చేరారు.
ఉన్నతవిద్యనభ్యసించి సొసైటీలో గొప్పగా బతుకుతాడనుకున్న కొడుకు అర్థాంతరంగా చనిపోవడంతో కుటుంబ సభ్యులు గుండెలు పగిలేలా రోధిస్తున్నారు. వారిని ఓదార్చడం గ్రామస్థుల వల్ల కాలేదు.. మహేష్ మరణంతో కప్పట గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. కాగా, మహేశ్ మృతదేహాన్ని భారత్‌కు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని కుటుంబ సభ్యులు కన్నీరు పెట్టుకున్నారు.