మత్తు మనిషిని ఎందాకైన తీసుకెళ్తుంది. దీనికి బానిసైన ఎంతో మంది మగాళ్లు వారి సంసారాలను నాశనం చేసుకుంటున్నారు. ఇలాగే హద్దులు దాటిన ఓ భర్త ఎవరూ ఊహించని దారుణానికి పాల్పడ్డాడు. కట్టుకున్న భార్యకు బతికుండగానే నరకం చూపిస్తూ రాక్షసానందాన్ని వెతుకున్నాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. షియోపూర్ కొత్వాలీ పరిధిలోని ఓ భార్యాభర్తలు నివాసం ఉంటున్నారు. పెళ్లైన కొన్ని రోజులు ఈ దంపతులు సంతోషంగానే జీవించారు.
కానీ రోజులు మారే కొద్ది భర్త ప్రవర్తనలో మార్పొచ్చి జులాయిగా తయారయ్యాడు. ఇదే కాక మద్యానికి, డ్రగ్స్ కు అలవాటు పడ్డ తరుచు మత్తులోనే ఉండేవాడు. ఇక భర్త ప్రవర్తనపై విసుగి చెందిన భార్య అనేక సార్లు పద్దతి మార్చుకోవాలంటూ భర్తకు చెప్పి చూసింది. అయినా భర్త తీరు మాత్రం అస్సలు మారలేదు. మరో దారుణ విషయం ఏంటంటే? తాగుడుకు భార్య డబ్బులు ఇవ్వకపోతే భర్త తీవ్రంగా హింసించేవాడు. అయితే ఇటీవల భర్త మద్యానికి డబ్బులు కావాలంటూ భార్యతో గొడవకు దిగాడు. ఇదే అంశం ఒకరిపై ఒకరు మాటల దాడి చేసుకునే దాక వెళ్లింది. పైగా భార్య డబ్బులు ఇవ్వకపోవడంతో భర్త భార్యపై పగ తీర్చుకోవాలనుకున్నాడు.
ఇందులో భాగంగానే భార్య చేతులు, కాళ్లను తాళ్లతో కట్టేశాడు. అనంతరం ఫెవిక్విక్ ను భార్య ప్రైవేట్ పార్ట్ లోకి జొప్పించి రాక్షసానందాన్ని వెతుకున్నాడు. ఈ క్రమంలోనే భార్య అరుపులు వేయడంతో స్జానికులు గమనించి ఇంట్లోకి చేరుకున్నారు. అనంతరం అతడి చెర నుంచి బాధితురాలిని రక్షించి వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. చికిత్స పొందుతున్న ఆ మహిళ పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ విషయం చివరికి పోలీసుల వరకు వెళ్లడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఈ దుర్మార్గుడి రాక్షసానందంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.